ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చినది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రమోషన్ల పరంగా ఒక అడుగు ముందుకు వేస్తోంది. టీజర్ రెడీ చేసే పనుల్లో టీమ్ బిజీగా ఉంది. తమన్ రీ రికార్డింగ్ మొదలుపెట్టేశాడు. మే నెల మధ్యలో లాంచ్ ఉంటుందనే తరహాలో దర్శకుడు మారుతీ సంకేతం ఇవ్వడంతో డౌట్ క్లియరైపోయింది. అయితే ఇందులో విడుదల తేదీ ఉంటుందా లేదానేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికి డేట్ లేకుండా వీడియో సిద్ధం చేస్తున్నారని, ప్రభాస్ తిరిగి వచ్చి బ్యాలన్స్ షూట్ కు సంబంధించిన కాల్ షీట్ల క్లారిటీ ఇస్తే అందులో పొందుపరుస్తారని, లేదంటే కమింగ్ సూన్ తప్ప ఇంకేం ఉండదని అంటున్నారు.
ఇన్ సైడ్ టాక్ అయితే టీజర్ లో అదిరిపోయే కంటెంట్, విజువల్స్, వింటేజ్ ప్రభాస్ లుక్స్ అన్ని ఉంటాయి. ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తి పరిచేలా మారుతీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికి తగ్గట్టే తమన్ బీజీఎమ్ అదిరిపోతుందట. ఇదంతా బాగానే ఉంది కానీ 2025 ప్రధానమైన డేట్లన్నీ ఒక్కొక్కరుగా బ్లాక్ చేసుకుంటూ పోతున్న తరుణంలో రాజా సాబ్ ఎప్పుడు వస్తాడో తెలియకపోతే బోలెడంత అయోమయం తలెత్తుంది. ఇంకా నాలుగు పాటలు బ్యాలన్స్ ఉన్నాయనే వార్త కొన్ని వారాలుగా తిరుగుతోంది. ఎంత వేగంగా తీసినా వీటికి కనీసం మూడు నాలుగు నెలలు అవసరమవుతాయి. ఇది పైకి ఈజీగా కనిపించేంత చిన్న టాస్క్ కాదు.
ఫౌజీ కూడా సమాంతరంగా చేస్తుండటం రాజా సాబ్ కొచ్చిన మరో ఇబ్బంది. రెండింటిలో ఒకే లుక్కు లేదు. అందుకే మారుతీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. నాలుగు వందల కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టుగా చెప్పబడుతున్న రాజా సాబ్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ ఓ ప్రధాన పాత్ర పోషించాడు. ఏదైతేనేం ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మరింత కిక్ రావాలంటే రిలీజ్ డేట్ చెప్పాలి. చూద్దాం.
This post was last modified on April 24, 2025 10:50 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…