ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్ ఆర్యన్ హీరోగా నాగ్జిల్లా అనౌన్స్ మెంట్ వచ్చింది. అదేంటి రాకాసి బల్లి గాడ్జిల్లా గురించి తెలుసు కానీ ఇదేంటి అనుకుంటున్నారా. అక్కడే ఉంది మతలబు. మనిషి పెద్ద పాముగా మారి కన్నెత్తి చూడలేనంత ఎత్తులో అరాచకం చేస్తే అదే నాగ్జిల్లా అన్నమాట. అలాని ఇదేదో ఆషామాషీ నిర్మాణ సంస్థ తీయడం లేదు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది 2026 ఆగస్ట్ 14 విడుదల చేస్తామని అఫీషియల్ గా చెప్పేశారు.
టీవీ సీరియళ్లలో ఇప్పటికే నాగిని తరహా బోలెడు పాము కథలు జనాలకు విసుగొచ్చే రేంజ్ లో వచ్చేశాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ జానర్ తర్వాత కనుమరుగయ్యింది. 90 దశకంలో తెలుగులోనూ బోలెడు పాము సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. హిందీలో శ్రీదేవి నాగిన్ అప్పట్లో గొప్ప క్లాసిక్. మన దగ్గర నల్లత్రాచు, నోము, దేవి, నాగమ్మ లాంటి కమర్షియల్ హిట్లు బోలెడున్నాయి. ఇప్పటి దర్శకులు వీటి జోలికి ఎందుకు వెళ్లడం లేదంటే అవుట్ డేటెడ్ అయిపోయింది కనక. కానీ నాగ్జిల్లా అంటూ మళ్ళీ దాన్ని తీసుకురావడం చూసి ఆడియన్స్ నవ్వుకోక ఏం చేస్తారు.
ప్రేక్షకులు హారర్ సినిమాలు ఎక్కువగా ఆదరిస్తున్నారనే భ్రమలో ఇలాంటి కాన్సెప్ట్స్ రాస్తున్నారు. స్త్రీ 2, ముంజ్యా, సైతాన్ లాంటి ఎందుకు సక్సెసయ్యానేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప ఎవరూ పాములను టచ్ చేయడం లేదనే ఉద్దేశంతో తెరకెక్కిస్తే కామెడీ అయిపోవచ్చు. పాత కాలంలో సర్పాలు ఎక్కువగా తిరిగేవి. జనం కూడా విపరీతంగా భయపడేవాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ లో నాగుల చవితి పండక్కు కూడా పాములు కనిపించడం లేదు. ఇలాంటి ట్రెండ్ లో నాగ్జిల్లా అంటూ వస్తున్న కార్తీక్ ఆర్యన్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. అన్నట్టు దీన్ని ప్యాన్ ఇండియా భాషల్లో డబ్బింగ్ చేస్తారట.
This post was last modified on April 23, 2025 3:38 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…