కెజిఎఫ్, సలార్ తో టాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మెగా ఫోన్ చేపట్టాడు. ఈయన డైరెక్షన్ చేసిన వీర చంద్ర హాస మొన్న శుక్రవారం కర్ణాటక థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలయ్యింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు తెచ్చుకునే దిశగా పరుగులు పెడుతోంది. తెలుగు డబ్బింగ్ వచ్చే వారం ఏప్రిల్ 25 రిలీజ్ చేస్తున్నారు. మరీ ఆలస్యం చేయకుండా త్వరగా తీసుకురావడం మంచి ఆలోచనే. జానపద కళల మీద విపరీతమైన ఇష్టమున్న రవి బస్రూర్ ఈ వీరచంద్రహాస కోసం యక్షగానం నేపధ్యాన్ని తీసుకున్నాడు. పది నిమిషాలు తక్కువ మూడు గంటల నిడివితో దీన్ని రూపొందించాడు.
థియేటర్ ఎక్స్ పీరియన్స్ పరంగా చెప్పాలంటే ఇదో కొత్త అనుభూతిని ఇవ్వనుంది. తెలుగు వాళ్ళకూ పరిచయమున్న యక్ష గానం కొత్త జనరేషన్ కు తెలియకుండా పోయింది. అయితే కన్నడనాట దీనికి ఆదరణ ఉంది. అందుకే రవి బస్రూర్ ఈ ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేయాలని ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. సంగీతం తనే సమకూర్చుకుని రెండు బాధ్యతలు నెరవేర్చాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్లు దర్శకులుగా మారిన దాఖలాలు ఇప్పటి తరంలో అస్సలు లేవు. ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ, రాజ్ కోటి, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, మిక్కీ జె మేయర్ ఇలా ఎవరూ దీని జోలికి వెళ్ళిందే లేదు.
కానీ రవి బస్రూర్ ఈ సాహసం చేశాడు. వీరచంద్రహాసలో మరో విశేషం ఏంటంటే శాండల్ వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలకమైన క్యామియో చేయడం. జైలర్, పెద్ది ద్వారా మనకూ దగ్గరైన ఈ సీనియర్ నటుడి స్క్రీన్ ప్రెజెన్స్ చంద్రహాసకు బాగా ఉపయోగపడిందని అక్కడి టాక్. కాకపోతే కన్నడ నేటివిటీ దట్టంగా ఉన్న ఈ స్టేజి డ్రామా తరహా కంటెంట్ ని మనోళ్లు ఎలా తీసుకుంటారనేది చూడాలి. మహాభారతంలోని అశ్వమేధిక పర్వంని స్ఫూర్తిగా తీసుకుని అల్లుకున్న కథగా ఇందులో డెప్త్ చాలా ఉంటుంది. అన్నట్టు కాంతార ఇచ్చిన స్ఫూర్తి శాండల్ వుడ్ మీద మాములుగా లేదు. వీరచంద్రహాస కూడా ఆ బాపతే.
This post was last modified on April 20, 2025 11:32 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…