Movie News

విశ్వంభర విఎఫెక్స్….తగ్గేదేలే !

ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పైకి తీసుకెళ్లలేకపోయిన విశ్వంభర కోసం తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతోంది. యూనిట్ వదులుతున్న సమాచారం మేరకు కేవలం విఎఫ్ఎక్స్ కే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టడం చిరంజీవి సినిమాకు ఇదే మొదటిసారి కానుంది. పలు విదేశీ నిపుణులు దీని కోసమే పని చేస్తున్నట్టు చెబుతున్నారు. దర్శకుడు వశిష్ఠ అనుకున్న విజన్ కి టీజర్ లో చూపించిన విజువల్స్ కి మధ్య చాలా తేడా రావడంతో రిపేర్ల గురించి మెగాస్టార్ చాలా సీరియస్ సూచనలు చేశారట. దానికి అనుగుణంగానే ఒకటికి పదిసార్లు క్వాలిటీ చెకింగ్ తో ఆలస్యమవుతున్నా తగ్గేదేలే అంటున్నారట.

బజ్ పరంగా వెనుకబడిన విశ్వంభరకు సాలిడ్ ప్రమోషన్లు అవసరం కాబోతున్నాయి. ముందుగా విడుదల తేదీ ఖరారు చేయాలి. జూలై 24 అనే ప్రచారం జోరుగా జరుగుతోంది కానీ యువి క్రియేషన్స్ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకోవైపు ఇతర సినిమాలు డేట్లను ఒక్కొక్కటిగా లాక్ చేసుకుంటూ వెళ్తున్నాయి. భోళా శంకర్ తర్వాత సుమారు రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న చిరు మూవీ ఇది. అందుకే ప్రకటన టైంలో అభిమానులు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ బిజినెస్, ఓటిటి పరంగానూ ఇబ్బందిగా మారుతోంది. ఇప్పుడవన్నీ సరిచేస్తున్నారు.

బయట హైప్ సంగతి ఎలా ఉన్నా విశ్వంభరలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వస్తున్నాయని టీమ్ లో వినిపిస్తున్న మాట. మొత్తం ఫైనల్ చెక్ అయ్యాక ట్రైలర్ కట్ ని ప్లాన్ చేస్తారట. ఎలాంటి తొందరపాటు లేకుండా బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ వశిష్టతో పాటు చిరుకి బాగా సన్నిహితంగా ఉండే పలువురు టాలీవుడ్ సీనియర్లు ఇందులో పాలు పంచుకుంటున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు కీరవాణి అందిస్తున్న సంగీతం నుంచి పెద్ద మేజిక్ ఆశిస్తున్నారు మ్యూజిక్ లవర్స్. రామ రామ పాట పర్వాలేదనిపించింది. రెండో సాంగ్ వచ్చే నెల వదులుతారు.

This post was last modified on April 20, 2025 7:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా,…

36 minutes ago

చింత‌మ‌నేనా.. మ‌జాకా.. 100 బ‌స్సులు.. వెయ్యి బైకులతో అమ‌రావ‌తికి!

ఏంచేసినా త‌న‌కంటూ స్పెష‌ల్‌గా ఉండే.. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. తాజాగా ఏపీ…

39 minutes ago

గాయకుడి లైవ్ షోలో పెహల్గామ్ వివాదం

ఈ మధ్య కర్ణాటకలో కన్నడ భాష రాని వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందుల మీద సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనిపిస్తున్నాయి.…

51 minutes ago

ప్రభాస్ ‘స్పిరిట్’లో కల్కి బ్యూటీ ?

ఎప్పుడు మొదలవుతుందో స్పష్టమైన సమాచారం లేకపోయినా స్పిరిట్ మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందులోనూ యానిమల్ లాంటి బ్లాక్…

1 hour ago

అమరావతి పండుగ!… అన్ని దారులూ అటువైపే!

ఏపీకి శుక్రవారం నిజంగా ఓ పండుగే. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పున:ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

‘అమరావతి రీస్టార్ట్’ కు మోదీ అదిరేటి గిఫ్ట్!

ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణం శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగవైభవంగా జరగనుంది. ఏపీ…

2 hours ago