మొన్న విడుదలైన ఓదెల 2కి భారీ ప్రమోషన్లు చేసిన సంగతి విదితమే. తమన్నా, నిర్మాత ప్లస్ రచయిత సంపత్ నంది కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ పబ్లిసిటీ చేశారు. అయితే దానికి తగ్గ ఓపెనింగ్స్ రాలేదన్నది స్పష్టం. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే ఓదెల బ్రాండ్ ని ఎక్కువగా ఊహించుకున్న టీమ్ దానికి తమన్నా ఫ్యాక్టర్ తోడై మొదటి రోజు థియేటర్లు నిండిపోతాయని ఊహించింది. కానీ ఓటిటిలో వచ్చిన మొదటి భాగం ఓదెల రైల్వే స్టేషన్ బోల్డ్, వయొలెంట్ కంటెంట్ వల్ల పరిమిత ప్రేక్షకులను చేరుకోగలిగింది. అది కూడా కరోనా టైంలో కావడంతో అనుకున్న దానికన్నా పెద్ద వ్యూస్ కనిపించాయి.
అంత మాత్రాన ఓదెల అంటే అదేమీ కెజిఎఫ్, పుష్ప లాగా బ్రాండ్ అయిపోలేదు. కానీ సంపత్ నంది లెక్క ఇక్కడ తప్పింది. తమన్నాని శివశక్తిని ఒక శక్తివంతమైన పాత్రలో చూపిస్తున్నాం కాబట్టి ఇది జనాలకు థ్రిల్లింగ్ అనుభూతి ఇస్తుందనుకున్నారు. అయితే అరుంధతి, పొలిమేర తరహా ఛాయలు పుష్కలంగా ఉండటంతో చూస్తున్న వాళ్లకు ఎంత వద్దనుకున్నా పోలికలు మెదడుని తొలుస్తూనే ఉన్నాయి. వసిష్ఠ సింహ, మురళీశర్మ క్యారెక్టర్లే దానికి ఉదాహరణ. ఇలాంటి హారర్ ఫాంటసీలలో లాజిక్స్ అక్కర్లేదు కానీ మరీ శివుడిని భూమి మీదకు రప్పించేంత డ్రామా పండాలంటే ఊహించలేనంత ట్విస్టులతో స్టోరీలో చాలా బలముండాలి.
కానీ తమన్నా ఒక్కర్తే అన్నీ కాచుకోలేకపోయింది. రెండు రోజులకు గాను రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో గ్రాస్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది కానీ ఇంకా సరైన సమాచారం లేదు. ఓదెల 2 ఫైనల్ స్టేటస్ ఏ దిశగా వెళ్తుందనేది బుధవారానికి క్లారిటీ వస్తుంది. ఈ వీకెండ్ ని వాడుకుని ఆలోగా పికప్ అయితే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. లేదూ ఇదే టాక్ కంటిన్యూ అయితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. రిలీజ్ కు ముందు వరకు బిజినెస్ వర్గాల్లో మంచి డిమాండ్ పలికిన ఓదెల 2 తీరా గ్రౌండ్ రియాలిటీలో దానికి భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. ఆదివారం మాత్రం ఓదెల 2కి కీలకం కానుంది. ఈ రోజు గట్టెక్కితే ఊరట కలుగుతుంది.
This post was last modified on April 19, 2025 5:11 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…