అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్. ఐతే చాలా ఏళ్ల నుంచి ఆయనకు సరైన విజయాలు లేవు. దీంతో దర్శకుడిగా సినిమాలు ఆపేశాడు. దీనికి తోడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, హీరోల విషయంలో అతడికి తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఈ మధ్య తాను బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఐతే తన గురించి బాలీవుడ్ మీడియాలో నెగెటివ్ వార్తలు రావడం.. సోషల్ మీడియాలోనూ నెగెటివ్ ప్రచారం జరగడం మామూలే. ఇలాంటి ప్రచారం మీదే ఇప్పుడు అనురాగ్ ఘాటుగా స్పందించాడు.
తాను సినిమాల్లేకుండా ఖాళీ అయిపోయానని ఒక వర్గం ప్రచారం చేస్తోందంటూ అతను మండిపడ్డాడు. తాను షారుఖ్ కంటే బిజీ అని.. రోజుకు మూడు సినిమాలు రిజెక్ట్ చేసే స్థాయిలో ఉన్నానని అనురాగ్ ట్వీట్ చేయడం విశేషం. నేను సినిమాలు వదిలేశాను అనుకున్న వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ చెబుతున్నా. నేను ఇక్కడే ఉన్నాను. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను (అలా కచ్చితంగా ఉండాలి, కానీ అతనంత డబ్బు మాత్రం సంపాదించను).
2028 వరకు నా డేట్స్ ఖాళీ లేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది మొదట్లో రెండు విడుదల కావచ్చు. నాకు సుదీర్ఘమైన ఐఎండీబీ ఉంది, రోజుకు మూడు ప్రాజెక్ట్‌లకు నో చెప్పేంత బిజీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ పని మీరు చూసుకోండి” అంటూ కొన్ని బూతులు కూడా జోడించి తన విమర్శకులకు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు అనురాగ్. కొన్నేళ్లుగా అనురాగ్ నటుడిగానే ఫుల్ బిజీగా ఉన్నాడు. తమిళంలో మహారాజ, లియో సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా మహారాజలో అనురాగ్ నటనకు ప్రశంసలు దక్కాయి. డకాయిట్ మూవీతో తెలుగు సినిమా డెబ్యూ చేయనున్నాడు.
This post was last modified on April 19, 2025 5:14 am
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…