Movie News

AI విప్లవం – సినిమా రంగంపై ప్రభావం

ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. గత ఏడాది విజయ్ గోట్ లో చనిపోయిన సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ కొన్ని నిముషాలు యువకుడిగా కనిపించడం చాలామందికి నమ్మశక్యం అనిపించలేదు. రజనీకాంత్ లాల్ సలాం కోసం ఏఆర్ రెహమాన్ ఎప్పుడో కాలం చేసిన సాహుల్ హమీద్, బంబ బక్యా గొంతులను రీ క్రియేట్ చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. కీడా కోలాలో ఎస్పి బాలు వాయిస్ ని ఇలాగే పునః సృష్టించే ప్రయత్నం చేయడం విమర్శతో పాటు వివాదమూ తీసుకొచ్చింది. ఇదంతా ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మహాత్యమే.

ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీలో కుర్ర అజిత్ ని చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. తాజాగా నిర్మాత దిల్ రాజు ఏఐ వ్యాపారంలోకి అడుగుపెట్టి అధికారిక ప్రకటన ఇచ్చేశారు. రాబోయే రోజుల్లో ఏఐకి ఎంత గొప్ప భవిష్యత్తు ఉందో ముందే పసిగట్టి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. తెలుగులోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమా మేకింగ్ లో కృత్రిమ మేధస్సుని వాడుకునే దిశగా దర్శకులు సీరియస్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు శంకర్ ఎలాగైతే విఎఫెక్స్ ప్రపంచాన్ని సౌత్ కి తీసుకొచ్చాడో అలాగే ఏఐలో తమదైన ముద్ర వేసేందుకు కొత్త తరం డైరెక్టర్లు ఉవ్విల్లూరుతున్నారు.

దీని వల్ల సమస్యలు లేకపోలేదు. మొత్తం ఏఐ చూసుకుంటే హీరోలకు కష్టపడే తత్వం తగ్గవచ్చు. సాంకేతిక నిపుణల పారితోషికాల్లో కోతలు ఉండొచ్చు. అంతెందుకు ఆర్టిస్టు అనుమతి తీసుకుని మొత్తం సినిమానే ఏఐలో తీయొచ్చు. ఒక పదేళ్ల తర్వాత ఈ టెక్నాలజీ పీక్స్ కు చేరుకున్నాక స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్, ఎంజిఆర్ లను ఏఐలో సృష్టించి మల్టీస్టారర్ తీసి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. గతంలో యమదొంగ, కలిసుందాం రా లాంటి వాటిలో ఈ ప్రయోగాలు చేశారు కానీ అవి క్వాలిటీ పరంగా తక్కువ స్థాయిలో ఉన్నవి. సహజంగా అనిపించవు. కానీ ఏఐలో ఆ సమస్య లేదు. నిజమేనేమో అనిపించేలా జీవకళ ఉట్టిపడేలా విజువల్స్ ని తయారు చేసుకోవచ్చు.

కొద్దిరోజుల క్రితం పెద్ది డైలాగుని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వీడియో నిజమని నమ్మేలా ఉంది. స్టార్ హీరోల ప్రస్తుత లుక్స్ ని వయసులో ఉన్నప్పటి లుక్స్ ని మిక్స్ చేసి వదిలిన క్లిప్ మాములుగా వైరల్ కాలేదు. రాబోయే సినిమాల్లో ప్రభాస్, మహేష్, తారక్ లుక్స్ ఎలా ఉంటాయో ఈ సాంకేతికత వాడుకుని కృత్రిమంగా ఫ్యాన్సే సృష్టించి ఔరా అనిపిస్తున్నారు. చిరిగిపోయిన తెరల నుంచి ఐమాక్స్ 8k స్క్రీన్ దాకా థియేటర్ ఎక్స్ పీరియన్స్ లో ఏవైతే మార్పులు వచ్చాయో అంతకన్నా విప్లవాత్మక సంచలనాలు ఏఐలో చూడబోతున్నాం. ఇక్కడిదాకా చెప్పింది కేవలం నాంది ప్రస్తావన మాత్రమే. అసలైన సినిమా ఇకపై మొదలుకాబోతోంది.

This post was last modified on April 16, 2025 6:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

5 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

5 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

6 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

6 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

9 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

10 hours ago