డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో ఒకటి. అందుకే అసలు పేరు కన్నా బుట్టబొమ్మగా ఎక్కువ గుర్తుండిపోయింది. అంతకు ముందు అరవిందసమేత వీరరాఘవ, మహర్షి లాంటి హిట్లతో తన రేంజ్ అలా అలా పెరుగుతూ వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత టాలీవుడ్ టైం పూజా హెగ్డేకు అట్టే కలిసి రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య నిరాశ పరచగా డబ్బింగ్ మూవీ బీస్ట్ తో పాటు హిందీ సినిమాలు సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా ఇవేవి అచ్చి రాలేదు. మే 1 రిలీజ్ కాబోతున్న రెట్రో మీద చాలా ఆశలు పెట్టేసుకుంది.
ఈ సందర్భంగా టీమ్ లో అందరికంటే ముందుగా తెలుగు ప్రమోషన్లు మొదలుపెట్టింది పూజా హెగ్డే. 2022 తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయినా పూజా హెగ్డే త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా ఒక ప్రేమకథతో. హీరో, నిర్మాణ సంస్థ, దర్శకుడు లాంటి వివరాలు చెప్పలేదు కానీ తిరిగి వస్తున్న సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసింది. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని, హైదరాబాద్ ని స్వంత ఇల్లులా ఫీలవుతానని చెప్పిన పూజా హెగ్డే బయోపిక్కుల గురించి మాట్లాడుతూ తనకు ఇష్టమైన శ్రీదేవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే వదులుకోకుండా ఖచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చింది.
ట్విస్ట్ ఏంటంటే గతంలోనే బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్ తీయనని ఖరాఖండిగా చెప్పేసారు. సో ఆ ఛాన్స్ లేనట్టే. ఇక రెట్రో విషయానికి వస్తే సూర్య సరసన అతని భార్యగా పూజా హెగ్డేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మాములుగా ఈయన సినిమాల్లో గ్లామర్ షో ఉండదు. హీరోయిన్ కూడా పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సిందే. అలాంటిది పూజా లాంటి అందమైన అమ్మాయికి ఎలా డిజైన్ చేసి ఉంటాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉండటంతో రెట్రో పనులు వేగవంతం అవుతున్నాయి. త్వరలోనే సూర్య వచ్చి ఇక్కడ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో భాగం కాబోతున్నాడు.
This post was last modified on April 16, 2025 10:20 am
థియేటర్ రిలీజ్ కావాల్సినంత బిల్డప్ ఉన్న సినిమా ఓటిటిలో వస్తే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అందులోనూ ఫైటర్ దర్శకుడు…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు…
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…