రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్ లో ఉండటం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ షాట్ తో కూడిన టీజర్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యి కూర్చుంది. సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే దీని రీచ్ ఎంతదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం పాతిక శాతం షూటింగ్ నుంచే ఇంత అవుట్ ఫుట్ వచ్చినప్పుడు ఇక ఫైనల్ పెద్ది ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్న శివరాజ్ కుమార్ నిన్న 45 టీజర్ లాంచ్ ఈవెంట్ కొచ్చినప్పుడు పెద్ది గురించి స్పందించారు.
రెండు రోజులు షూట్ లో పాల్గొన్నానని, పెద్ది టీమ్ తో పని చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉందని, బాగా చేసినవాళ్లకు బుచ్చిబాబు ఇచ్చే ప్రశంసలు చాలా ఎనర్జీ ఇస్తాయని, రామ్ చరణ్ లాంటి స్వీట్ పర్సన్ గా కలిసి పని చేయడం వల్ల అతని ప్రేమలో పడిపోయానని అంత పెద్ద సీనియర్ స్టార్ చెప్పడం చూస్తే తెరమీద వీళ్ళ బాండింగ్ ఎంత గొప్పగా పండి ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతే కాదు పెద్ది చాలా గొప్ప స్క్రిప్టని చెప్పిన శివరాజ్ కుమార్ తనది స్పెషల్ క్యారెక్టరే అయినప్పటికీ గొప్పగా వచ్చిందని హైప్ పెంచేశారు. గత ఏడాది కూడా ఒక ఇంటర్వ్యూలో ఇంతకన్నా ఎక్కువ ఎలివేషన్లతో పెద్ది గురించి చెప్పారు శివన్న.
ఈ లెక్కన జైలర్ ని మించిన ఇంపాక్ట్ శివరాజ్ కుమార్ పెద్దిలో ఇవ్వబోతున్నారనేది స్పష్టం. అసలు జైలర్ లో తన పాత్ర ఎందుకు ఆ రేంజ్ హిట్టయ్యిందో ఇప్పటికీ తెలియదని, టిష్యూ పేపర్ బాక్స్ తోయడం తప్ప మీరేం చేశారని భార్య అడుగుతూ ఉంటుందని, అంతకు మించి ఇంకేం తెలియదని చెప్పి శివన్న నవ్వులు పూయించారు. ఉపేంద్రతో కలిసి నటించిన 45 ఆగస్ట్ లో విడుదలకు రెడీ అవుతోంది. వీళ్ళ కాంబోలో ముప్పై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ హిట్ ఓం వచ్చిన సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ స్టేజి నుంచే 45 మీద శాండల్ వుడ్ లో ఓ రేంజ్ అంచనాలున్నాయి. రాజ్ బి శెట్టి కూడా ఈ మల్టీస్టారర్ లో భాగమయ్యారు.
This post was last modified on April 16, 2025 10:15 am
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…