టాప్ స్టార్లు వర్తమానంలో చేస్తున్న సినిమా మీద అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో.. అలాగే వారి ఫ్యూచర్ ప్రాజెక్టుల మీదా అంతే క్యూరియాసిటీ ఉంటుంది. టాలీవుడ్లో పెద్ద హీరోలందరూ ఇంట్రెస్టింగ్ లైనప్స్‌తోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓవైపు బాలీవుడ్ మూవీ ‘వార్-2’ను పూర్తి చేసే పనిలో ఉన్న తారక్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత తారక్ నటించే సినిమా ఏదనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
అతను తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ప్రస్తుతం ‘జైలర్-2’ చేస్తున్న నెల్సన్.. అది పూర్తవగానే తారక్ సినిమాను మొదలుపెడతాడని భావిస్తున్నారంతా. ఐతే నెల్సన్ మూవీ కొంచెం ఆలస్యం కాబోతోందని అర్థమవుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఎన్టీఆర్ ‘దేవర-2’ అటకెక్కినట్లే అనుకున్నారంతా. ‘దేవర’ నెగెటివిటీని తట్టుకుని ఎలాగోలా సక్సెస్ అనిపించుకుంది కానీ.. ‘దేవర-2’ విషయంలో అభిమానుల్లోనే అంతగా ఆసక్తి లేని నేపథ్యంలో ఆ సినిమా ఉండదనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తారక్ ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.
తాజాగా తారక్ అన్నయ్య కూడా ‘దేవర-2’ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. తారక్ ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయగానే ‘దేవర-2’ సెట్స్ మీదికి వెళ్తుందని స్పష్టం చేశాడు. అది పూర్తి చేశాక నెల్సన్ సినిమాను మొదలుపెడతాడని కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘దేవర’ నిర్మాతల్లో కళ్యాణ్ రామ్ ఒకడన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా కన్ఫమ్ చేశాడంటే ‘దేవర-2’ కచ్చితంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లనుంది. ప్రస్తుతం కొరటాల శివ వేరే ప్రాజెక్టులేమీ టేకప్ చేయకుండా ‘దేవర-2’ మీదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్-నెల్సన్ మూవీ 2027లో కానీ పట్టాలెక్కదన్నమాట.
This post was last modified on April 14, 2025 1:08 pm
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…