ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో ఎట్టకేలకు తనకు సరిపోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఎంచుకున్నాడు. ఏప్రిల్ 18 అర్జున్ సన్నాఫ్ వైజయంతి విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రేడ్ సర్కిల్స్ లో మంచి అంచనాలు మోస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్ల పరంగా తీసుకుంటున్న శ్రద్ధ హైప్ పెంచుతోంది. అందులోనూ సరిలేరు నీకెవ్వరు తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఒప్పుకున్న సినిమా ఇదే కావడం మరో ఆకర్షణగా నిలిచింది. కథేంటో దాచకుండా చెప్పేశారు.
వైజాగ్ నగరానికి తిరుగు లేని రౌడీలుగా చెలామణి అవుతున్న వాళ్ళలో అర్జున్ (కళ్యాణ్ రామ్) పేరు ముందుంటుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి) కొడుకు ఇలా హంతకుడిగా మారడం చూసి డిపార్ట్ మెంట్ ఆశ్చర్యపోతుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరుడు గట్టిన తీవ్రవాది (సోహైల్ ఖాన్) కి అర్జున్, వైజయంతిలతో శత్రుత్వం ఏర్పడుతుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో అర్జున్ ఒంటి మీదకు ఖాకీ చొక్కా వస్తుంది. ఇంతకీ ఇతను గూండానా పోలీసా, ఎందుకు రూపాలు మార్చుకోవాల్సి వచ్చింది, అమ్మ ద్వేషించేలా అతనేం చేశాడనేది వచ్చే శుక్రవారం థియేటర్లలో చూస్తే తెలుస్తుంది.
యాక్షన్, ఎమోషన్ రెండూ కలగలుపుతూ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అర్జున్ సన్నాఫ్ వైజయంతిని తీర్చిదిద్దిన వైనం మాస్ లో ఆసక్తి పెంచేలా ఉంది. వాళ్లకు కావాల్సిన అంశాలు జొప్పిస్తూనే బలమైన మదర్ సెంటిమెంట్ జోడించడం కంటెంట్ పరంగా ప్లస్ అవుతోంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ అన్నట్టు అతనొక్కడే, పటాస్ వైబ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అసలు సినిమా కూడా ఇంతే మోతాదులో ఉంటే మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టే. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సల్మాన్ సోదరుడు సోహైల్ మెయిన్ విలన్.
This post was last modified on April 12, 2025 8:39 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…