మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్ అయింది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అంటే.. మాస్ పాటలు, అందులో అదిరిపోయే శ్రీలీల స్టెప్పులే. రవితేజ పక్కన శ్రీలీల ఏంటి అని రిలీజ్‌కు ముందు చాలామంది కామెంట్లు చేశారు కానీ.. ఆ జోడీ మాస్ పాటలతో స్క్రీన్లను తగలెట్టేసింది. ఇప్పుడు ఈ జోడీని మళ్లీ తెరపై చూడబోతున్నాం. రవితేజ కొత్త చిత్రం ‘మాస్ జాతర’లోనూ శ్రీలీలే హీరోయిన్. ‘ధమాకా’కు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ చిత్రానికీ మ్యూజిక్ చేశాడు. అసలే రవితేజ సినిమా.
పైగా ‘మాస్ జాతర’ అనే టైటిల్ పెట్టారు. పైగా రవితేజకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్ర చేస్తున్నాడిందులో. దీంతో మాస్ రాజా మాస్ ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం నుంచి తొలి పాట గురించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. ఈ పాట ప్రోమో రవితేజ అభిమానుల్లో మాంచి హుషారు పుట్టించింది. ఇందులో రవితేజ తన ఫేమస్ ‘ఇడియట్’ స్టెప్ వేయడం విశేషం. ఆ చిత్రంలో చూపుల్తో గుచ్చి గుచ్చి పాటకు రవితేజ వేసిన స్టెప్ ఐకానిక్‌గా నిలిచిపోయింది.
ఈ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు మళ్లీ ఆ స్టెప్‌ను రీక్రియేట్ చేయించారు రవితేజతో. ఈ స్టెప్ నోస్టాల్జిగ్గా అనిపించగా.. పక్కనే శ్రీ లీల కూడా ఉండడంతో ఈ పాట మీద అంచనాలు పెరిగిపోయాయి. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజ-శ్రీలీల జోడీ స్క్రీన్ మీద మాంచి ఫైర్ చూపించబోతోందని అర్థమవుతోంది. మంచి ఫాంలో ఉన్న భీమ్స్ నుంచి ఊపున్న మాస్ పాటను ఆశిస్తున్నారు అభిమానులు. ‘సామజవరగమన’ రైటర్ భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on April 12, 2025 5:40 pm
రాజకీయాల్లోకి అఖిల భారత ఉద్యోగులు రావడం సహజం అయిపోయింది. ఉద్యోగాలు విరమణ చేసిన వారు కొందరు.. మధ్యలోనే పీక్ స్టేజ్లో…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే లవకుశ పాట టాలీవుడ్ కు అచ్చంగా సరిపోతుంది. కొన్ని కాంబినేషన్లు రూపొందే…
దర్శకుడు ప్రశాంత్ వర్మకి హనుమాన్ కన్నా ముందు కమర్షియల్ గా బ్రేక్ ఇచ్చిన సినిమా జాంబీ రెడ్డి. అప్పటిదాకా టాలీవుడ్…
ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ రూపంలో ఒక్కసారి బ్రేక్ దక్కిందంటే ఆ దర్శకుడి సుడి మాములుగా తిరిగదు. వెంకీ అట్లూరి పరిస్థితి…
"విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మే నెల 2న అమరావతి రానున్న ప్రధాన…