ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. ఇంతకు ముందు కమెడియన్, సోలో హీరోగా టాలీవుడ్ లో ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నా తమిళంలో పెద్దగా గుర్తింపు లేదు. కానీ పుష్ప 2 అక్కడా విజయం సాధించాక లెక్కలు మారిపోయాయి. శివ కార్తికేయన్ మహావీరుడు (మావీరన్) లో చేసింది చిన్న పాత్రే అయినా మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత జైలర్ తో ఒక్కసారిగా దశమారిపోయింది. రజనీకాంత్ సినిమా సెకండాఫ్ లో ఎక్కువ సేపు కనిపించి అక్కడి ప్రేక్షకులను మెప్పించడం మాములు విషయం కాదు.
తర్వాత విశాల్ మార్క్ ఆంటోనీ సైతం హిట్టు క్యాటగిరీలోనే పడింది. తెలుగు డబ్బింగ్ ఆడలేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకుంది. దీని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తిరిగి సునీల్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో మరో మంచి ఆఫర్ ఇచ్చాడు. అజిత్ గ్యాంగ్ లో కీలక సభ్యుడిగా మంచి వేషం దక్కడమే కాదు ప్రీ క్లైమాక్స్ లో కాసిన్ని ఎలివేషన్లు కూడా పడ్డాయి. ఆడియన్స్ వీటిని ఎంజాయ్ చేస్తున్న వైనం తమిళనాట కనిపిస్తోంది. కన్నడలో కిచ్చ సుదీప్ మ్యాక్స్, మలయాళంలో మమ్ముట్టి టర్బోతో ఇంతకు ముందే ఆయా భాషల్లో సునీల్ తెరంగేట్రం విజయవంతంగా జరిగిపోయింది.
క్రమంగా సునీల్ ని అరవ దర్శకులు లక్ ఫాక్టర్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలోనే నాలుగైదు అవకాశాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయట. తెలుగులో ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ లో భాయ్ గా ఎక్కువ ప్రాధాన్యం దక్కించుకున్న సునీల్ దాన్ని నిలబెట్టడమే కాదు సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాడు. ఒక టైంలో హీరోగానే నటించాలని ఫిక్సయిపోయిన సునీల్ వరుస ఫ్లాపుల దెబ్బకు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆ తర్వాతే కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా బ్రహ్మాండంగా జరిగిపోతోంది. గత ఏడాది ఒక్క టాలీవుడ్లోనే డజనుకి పైగా సినిమాలు చేయడమంటే మాటలా.
This post was last modified on April 12, 2025 8:26 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…