ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా ప్రాజెక్టు ఓకే అయిపోయింది. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. అయితే జాట్ చూశాక వాళ్లలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. తనకు పట్టున్న మాస్ ఎలిమెంట్స్ మీద కాకుండా ఈసారి మలిలేని ఎక్కువగా విలనిజం, వయొలెన్స్ మీద దృష్టి పెట్టాడు. అసలు రణదీప్ హుడా పోషించిన పాత్రకు అవసరానికి మించిన నిడివి డిజైన్ చేసుకోవడం దగ్గరే పొరపాటు మొదలయ్యింది.
దీనికి తోడు హింస మోతాదు బాగా ఎక్కువయ్యింది. ఊళ్ళో యువకులు వేళ్ళు కోసుకుని ప్రెసిడెంట్ కు పంపడం, ఇంటికొచ్చిన లేడీ పోలీసులతో రెజీనా క్యారెక్టర్ ప్రవర్తించే తీరు, పదే పదే తలలు నరికే విజువల్స్ ఇవన్నీ మాస్ కేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ జడుసుకునేలా ఉన్నాయి. ప్రతిదానికి మాస్ ముద్ర వేయలేం. సమరసింహారెడ్డి, ఇంద్ర, అతనొక్కడే లాంటి సినిమాల్లో కూడా తలలు నరికే సీన్లుంటాయి. కానీ వాటి డైరెక్టర్లు ఒకటి రెండు షాట్లకు పరిమితం చేశారు. కానీ జాట్ లో రిపీట్ గా చూపించడం వల్ల ఒక వర్గం క్లాస్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
తమ హీరోతో చేయబోయే సినిమాలో జాట్ లా కాకుండా బాలయ్య మార్కు ఫార్ములా వాడాలని కోరుకుంటున్నారు. వీరసింహారెడ్డిలోనూ సెకండాఫ్ పరంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వాల్తేరు వీరయ్య తర్వాత నిలవాల్సి వచ్చిందనే కామెంట్స్ లేకపోలేదు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అంటే జాట్ తరహా ట్రీట్ మెంట్ కన్నా రవితేజ క్రాక్ టైపు స్క్రీన్ ప్లేని రాసుకుంటే ఇంకో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణకు ఇవ్వొచ్చు. సల్మాన్ ఖాన్ సికందర్ కంటే మేలే అనిపించుకున్నప్పటికీ జవాన్, గదర్ 2 స్థాయిలో జాట్ బ్లాక్ బస్టరయ్యే సూచనలు లేనట్టే. కాకపోతే డీసెంట్ వసూళ్లతో గట్టెక్కుతుందేమో చూడాలి.
This post was last modified on April 12, 2025 1:12 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…