తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు ఆడుతున్న అతణ్ని.. తమిళులు దత్తపుత్రుడిలా భావిస్తారు. సీఎస్కే రికార్డు స్థాయిలో ఐదుసార్లు కప్పు గెలిచిందన్నా.. ఐపీఎల్‌లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టుగా ఎదిగిందన్నా అందులో ధోని పాత్ర అత్యంత కీలకం. కేవలం ధోని ఆట చూడ్డానికే ఫ్యాన్స్ స్టేడియానికి పరుగులు పెడతారు. దేశవ్యాప్తంగా చెన్నై జట్టుకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండడానికి ధోనీనే కారణం. ఐతే వయసు మీద పడడం.. ఫిట్‌నెస్, ఫామ్ తగ్గడంతో కొన్నేళ్లుగా లీగ్‌లో ధోని ప్రదర్శన అంత గొప్పగా లేదు. కానీ సీఎస్కే అతణ్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు.
ధోని కూడా వీలైనంత కాలం ఆడాలనుకుంటున్నాడు. కాబట్టే 44వ పడికి చేరువ అవుతున్నా అతను ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ఐతే చెన్నై జట్టు బాగా ఆడుతుంటే ధోనికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ఈ సీజన్లో ఆ జట్టు ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. ఆరు మ్యాచ్‌ల్లో సీఎస్కే ఐదు ఓడిపోయింది. దీంతో ధోని మీద సొంత అభిమానుల నుంచే విమర్శలు తప్పట్లేదు. శుక్రవారం కోల్‌కతా చేతిలో చెన్నై చిత్తుగా ఓడడం.. ధోని బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో వచ్చి ఒక్క పరుగే చేసి ఔటవడంతో ధోని మీద చెన్నై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐతే మామూలు ఫ్యాన్స్ తిడితే ఓకే కానీ.. ఒక సినిమా హీరో ధోని మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. ఒకప్పుడు క్రికెటర్ అయిన విష్ణు విశాల్.
కోల్‌కతా చేతిలో చెన్నై చిత్తయిన అనంతరం విష్ణు.. ‘‘స్వయంగా నేనొక క్రికెటర్ కావడంతో నన్ను నేను చాలా నియంత్రించుకున్నాను. అంత త్వరగా ఒక నిర్ణయానికి రాను. కానీ ఇది మరీ అరాచకం. బ్యాటింగ్ ఆర్డర్లో మరీ అంత దిగువన రావడం ఎందుకు? గెలవకుండా ఉండడానికి ఆడడం ఏ ఆటలోనైనా చూస్తామా? సర్కస్‌కు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఆట కంటే ఏ ఆటగాడూ ఎక్కువ కాదు’’ అని ట్వీట్ చేశాడు. ధోని పేరెత్తకపోయినా.. అతణ్ని ఉద్దేశించే విష్ణు ఈ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టం. ఈ ట్వీట్ నేపథ్యంలో విష్ణును కొందరు తిడుతున్నప్పటికీ.. అతణ్ని సమర్థిస్తున్న వాళ్లూ లేకపోలేదు.
This post was last modified on April 12, 2025 2:53 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…