పెద్ద సినిమాలకు విడుదల తేదీ దోబూచులాటలు తప్పడం లేదు. ముందు ఒక డేట్ అనుకోవడం, తర్వాత దానికి కట్టుబడలేక మార్చుకోవడం, దాని వల్ల ఆ టైంలో రావాలనుకున్న వేరేవి ప్రభావితం చెందటం పరిపాటిగా మారింది. విశ్వంభరని జూలై 24 రిలీజ్ చేయడం దాదాపు ఖరారయ్యిందనే లీక్ చక్కర్లు కొడుతోంది కానీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం ఫ్యాన్స్ అయోమయాన్ని పెంచుతోంది. రేపు లాంచ్ కాబోతున్న రామ రామ సాంగ్ లో దీనికి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇండస్ట్రీ హిట్ ఇంద్ర వచ్చిన సెంటిమెంట్ డేట్ కాబట్టి ఫ్యాన్స్ దీన్నే బలంగా కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రవితేజ మాస్ జాతరకి జూలై 18 ఆప్షన్ చూస్తున్నారని లేటెస్ట్ అప్డేట్. అదే కనక జరిగితే బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య అన్న తమ్ముళ్ల మధ్య కేవలం ఒక్క వారం మాత్రమే గ్యాప్ వస్తుంది. విచిత్రంగా ఈ రెండూ రకరకాల కారణాలతో పోస్టు పోన్ చేసుకుంటూ వచ్చినవే. మాస్ జాతరని మొన్న సంక్రాంతికి అనుకున్నారు. కానీ గత ఏడాది రవితేజ యాక్సిడెంట్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. రచయిత భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. భీమ్స్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి.
ఇక విశ్వంభర సంగతి తెలిసిందే. అచ్చం మాస్ జాతర లాగే సంక్రాంతి బరిని వదులుకుంది. పైకి గేమ్ ఛేంజర్ కోసం త్యాగమని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి అప్పటికి చాలా వర్క్ పెండింగ్ ఉంది. టీజర్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల విఎఫెక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోంది. ఫైనల్ గా జూలై 24 లాక్ చేస్తారో లేదో చూడాలి. అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ వచ్చే దాకా ఈ క్లాష్ మీద ముద్ర వేయలేం కానీ మరీ ఇంత తక్కువ గ్యాప్ అన్నా ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది కలగొచ్చు. చిరు, రవితేజ మధ్య బాండింగ్ దృష్ట్యా ఈ ఫేస్ టు ఫేస్ ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on April 11, 2025 2:42 pm
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…