రేపు విడుదల కాబోతున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదటి టికెట్ ని రామ్ చరణ్ కొన్న వీడియో బయటికొచ్చాక ప్రమోషన్స్ పరంగా మంచి బూస్ట్ దక్కినట్టయ్యింది. యాంకర్ ప్రదీప్ సోలో హీరోగా నాలుగేళ్ళ క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చేశాడు. నీలి నీలి ఆకాశం పాట పుణ్యమాని ఓపెనింగ్స్ దక్కడంతో పాటు డీసెంట్ టాక్ తో కమర్షియల్ గా నిర్మాతను గట్టెక్కించింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కామెడీ గురించి ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో అదే రేపు పబ్లిక్ నుంచి కూడా వచ్చిందంటే సుడి తిరిగినట్టే. అసలు పాయింట్ ఇది కాదు.
టఫ్ కాంపిటీషన్ ఇస్తాయనుకున్న జాక్, గుడ్ బ్యాడ్ ఆగ్లీలకు మిశ్రమ స్పందన రావడం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కలిసి వచ్చేలా ఉంది. గురువారమే వచ్చిన మొదటి రెండు సినిమాలు బడ్జెట్, కంటెంట్ పరంగా చాలా పెద్దవి. సిద్దు జొన్నలగడ్డ, అజిత్ లతో పోలిస్తే ప్రదీప్ చిన్నవాడు. ఇమేజ్ లోనూ సరితూగడు. సో కంటెంట్ తో మెప్పించాల్సిందే. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ గానే అనిపించింది. మ్యాడ్ స్క్వేర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఖాళీ ఏర్పడింది. యూత్, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి సరైన ఆప్షన్ లేదు. ఈ గ్యాప్ ని కనక ప్రదీప్ వాడుకుంటే ఒక రోజు అటుఇటుగా అయినా థియేటర్ పికప్ చూడొచ్చు.
ఎలాగూ చేతిలో ఒక వారం టైం ఉంటుంది. ఏప్రిల్ 17 ఓదెల టూ , 18 అర్జున్ సన్నాఫ్ వైజయంతి వస్తున్న నేపథ్యంలో మాస్ జనాల దృష్టి వీటివైపు వెళ్ళిపోతుంది. రెండు రోజుల గ్యాప్ లో 20న సారంగపాణి జాతకం ఉంది. ఆలోగానే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పని కానిచ్చేయాలి. నితిన్ – భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ కి రధన్ సంగీతం సమకూర్చాడు. సినిమా మీద నమ్మకంతో హైదరాబాద్ లో ముందు రోజు రాత్రే కొన్ని షోలు వేస్తున్నారు. ఇది కనక క్లిక్ అయితే ప్రదీప్ కు మరికొన్ని అవకాశాలు వస్తాయి. కాకపోతే టీవీ వ్యాఖ్యాతగా థియేటర్లకు జనాన్ని రప్పించడం సవాలే.
This post was last modified on April 10, 2025 8:04 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…