పాండమిక్ కారణంగా తెలుగు సినిమా అతలాకుతలం కాగా, నిర్మాతలు ఆచితూచి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు లేని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో సినిమానే చేతులు మారిపోయిందంటే పరిస్థితి ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ టైమ్‍లో ఎవరయితే తమ పారితోషికం పరంగా ఫ్లెక్సిబుల్‍గా వున్నారో వారికే నిర్మాతలు ప్రాధాన్యమిస్తున్నారు.
సిట్యువేషన్‍ని సరిగ్గా అనలైజ్ చేసిన యువ హీరో శర్వానంద్ తన పారితోషికం బాగా తగ్గించుకున్నాడట. అందుకే ఇప్పుడు ఏ హీరోకీ లేనన్ని సినిమాలు అతడికి వున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇటీవల తన గ్రాఫ్ కూడా కాస్త డౌన్ అవడం వల్ల శర్వానంద్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వెనుకాడినట్టు లేడు.
శర్వానంద్ సినిమాలకు గ్యారెంటీ రిటర్నస్ అంటూ వుంటాయి కనుక రిస్క్ వున్న ఇతర హీరోల కంటే ఇతను బెస్ట్ అని ప్రొడ్యూసర్స్ ఇటు మొగ్గుతున్నారు. నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఇలా ఎవరయితే ఫ్లెక్సిబుల్‍గా వుంటారో వారికే ఫ్యూచర్ వుంటుందని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
This post was last modified on November 1, 2020 10:16 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…