ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ షాట్ కూడిన విజువల్ ని విడుదల చేయడం, మాస్ కి వెంటనే ఎక్కేలా రామ్ చరణ్ ని చూపించిన విధానం భారీ స్పందన తెచ్చుకున్నాయి. వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు రీల్స్ లోనూ వేగంగా యూత్ కి పాకేస్తోంది. అయితే అందరూ అనుకున్నట్టు ఇది క్రికెట్ ని ప్రధాన అంశంగా రూపుదిద్దుకుంటున్న కథ కాదట. గతంలో ప్రచారం జరిగినట్టు ఈ ఆటతో పాటు కుస్తీ చాలా కీలకంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఈ ఎపిసోడ్స్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫైట్స్ వేరే లెవెల్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్.
ఇప్పటిదాకా షూట్ చేసింది కొంచెం అటు ఇటుగా ముప్పై శాతం మాత్రమే. ఇంతోటి దానికే దర్శకుడు బుచ్చిబాబు ఇన్ని ఎలివేషన్లు ఇస్తే మొత్తం కంటెంట్ లో ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లగాన్ తరహాలో క్రికెట్ ని ఎమోషన్, యాక్షన్ తో ముడిపెడుతూ తనదైన మార్కు హీరోయిజంతో చరణ్ పండించే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. తనతో పాటు జగపతిబాబు, దివ్యెందులున్న సీన్లు కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్రికెట్ కుస్తీతో పాటు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆడియన్స్ కి షాక్ ఇవ్వడం ఖాయమని వినికిడి. సో ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే రిలాక్స్ అవ్వడానికి లేదు.
ఇంకా ఏడాది సమయం ఉండగానే పెద్దికి ఈ స్థాయిలో హైప్ రావడం బిజినెస్ పరంగా ఉపయోగపడుతోంది. అగ్రిమెంట్లు ఇప్పుడప్పుడే క్లోజ్ చేసేందుకు మైత్రి,వృద్ధి నిర్మాతలు సుముఖంగా లేరట. ఇంకో నాలుగైదు నెలల తర్వాత అడ్వాన్సుల గురించి మాట్లాడుకుందామని బయ్యర్లకు చెప్పినట్టు తెలిసింది. పుష్ప, ఎన్టీఆర్ నీల్, హను రాఘవపూడి సినిమాల తర్వాత ఆ స్థాయి ప్యాన్ ఇండియా పొటెన్షియాలిటీ ఉన్న మూవీగా పెద్ది మీద మాములు బజ్ లేదు. హిందీలోనూ భారీ స్పందన రావడం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు. తిరిగి ఇంకో నాలుగైదు నెలల వరకు పెద్ది నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఉండకపోవచ్చు.
This post was last modified on April 10, 2025 6:34 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…