ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు చెక్ పెడుతూ జూన్ 27 థియేటర్లకు తీసుకొస్తున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించడంతో డౌట్లు తీరిపోయాయి. తాజాగా కుటుంబ గొడవల నేపథ్యంలో తన భైరవంకు భయపడే కన్నప్పని వాయిదా వేశారని మనోజ్ చెబుతున్న పరిస్థితిలో మరి ఇప్పుడు తన సినిమాని ఎప్పుడు తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. అన్నయ్యతో సమాంతరంగా రెండు నెలలు ఆగే సీన్ భైరవంకు ఉండకపోవచ్చు. పైగా అందులో మనోజ్ మెయిన్ హీరో కాదు.
ఈ సంగతలా ఉంచితే కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికిందని చెప్పాలి. ఇప్పటిదాకా ఆ నెలలో నోటెడ్ రిలీజు ఒక్క కుబేర మాత్రమే. 20కి లాక్ చేసుకుపోవడం తెలిసిందే. దాని తర్వాత వారం గ్యాప్ తో కన్నప్ప దిగుతాడు. ఇంకో డెబ్భై రోజులకు పైగా సమయం దొరకడంతో మంచు విష్ణుకి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం దొరికింది. ఇటీవలే కొంత ఫుటేజ్ ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్న కుటుంబ సభ్యులు, ఇతర యూనిట్ మెంబెర్స్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా పని చేయిస్తున్నట్టు తెలిసింది. ప్రభాస్ ఎపిసోడ్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఇదే ముఖ్యమైంది.
ఇప్పటికిప్పుడు ప్రమోషన్లకు తొందరేం లేదు కాబట్టి మే నుంచి మొదలుపెట్టినా సరిపోతుంది. పబ్లిసిటీ పరంగా విష్ణు అందరికి భాగం దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ అందుబాటులో ఎప్పుడు వస్తాడనే దాన్ని బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లు వగైరాలు పెట్టుకోవాలి. ఇక భైరవం సంగతి ఇంకో వారం పది రోజుల్లో తేలొచ్చు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. డిసెంబర్ నుంచి వాయిదాలు వేసుకుంటూ ఏప్రిల్ దాటిపోతున్నారు. వచ్చే నెల ఆప్షన్లు చూస్తున్నారు కానీ ఇంకా ఓటిటి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఎలా చూసుకున్నా రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే రావడం ఖాయం.
This post was last modified on April 9, 2025 5:07 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…