ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14 వస్తున్న సంగతి తెలిసిందే. ఎవరూ వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాలన్స్ ఉన్న ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మీద తీయాల్సిన చివరి పాట కోసం ప్లానింగ్ లో ఉంది. ఇంకోవైపు కూలికి ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాడు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కష్టపడుతున్నాడు.
ఇదిలా ఉండగా తారక్, రజని క్లాష్ వచ్చే ఏడాది కూడా ఉంటుందని కోలీవుడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఎలా అంటే ఎన్టీఆర్ నీల్ ఏప్రిల్ 9 రిలీజ్ అవుతుందనే వార్త ప్రచారంలో ఉండగా జైలర్ 2 ఒక వారం అటుఇటు లేదా అదే రోజు దీనికి కాంపిటీషన్ గా వస్తుందని అంటున్నారు. అసలింకా రెండు సినిమాల నుంచి అఫీషియల్ అప్డేట్ రాలేదు. రిలీజ్ డేట్ల ప్రస్తావనే లేదు. ఏప్రిల్ 22 నుంచి నీల్ సెట్లో తారక్ అడుగు పెట్టనుండగా జైలర్ 2 కోసం రజని వచ్చే వారం నుంచి మేకప్ వేసుకుంటారు. అంటే రెండూ సమాంతరంగా షూట్ లో ఉంటాయని అర్థమవుతోంది. సో విడుదల తేదీ గురించి ఇప్పుడే చర్చ అనవసరం.
మరో విషయం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. జైలర్ 2 దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తర్వాత చేయబోయే సినిమా జూనియర్ ఎన్టీఆర్ తోనే. అలాంటప్పుడు వీలైనంత వరకు నీల్ మూవీకి పోటీగా వెళ్లాలని అనుకోడు. పైగా వార్ 2, కూలి యుద్ధం వల్ల ఎవరు లాభపడ్డారో ముందే తెలిసిపోతుంది కాబట్టి ఆ ఫలితాన్ని బట్టి నిర్మాతలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి తమిళ ట్రేడ్ వర్గాల దగ్గర కూలికి సంబంధించిన పక్కా డేట్ తప్ప జైలర్ 2 గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏడాదికి ముందే రజని, తారక్ మళ్ళీ తలపడతారా అనే డిస్కషన్ వేస్ట్.
This post was last modified on April 9, 2025 4:57 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…