బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న వార్ 2 పూర్తవ్వగానే స్వీయ దర్శకత్వంలో హృతిక్ దీన్ని తెరకెక్కించబోతున్నాడు. స్క్రిప్ట్ దాదాపుగా పూర్తి కావొస్తోందని ముంబై టాక్. తండ్రి రాకేష్ రోషన్ దీన్ని ఎప్పటి నుంచో రాసుకుంటూ వస్తున్నారు. డైరెక్షన్ వేరేవాళ్లకు ఇచ్చి తను పర్యవేక్షణ చేయాలనుకున్నారు. కానీ యష్ రాజ్ ఫిలింస్ ఆదిత్య చోప్రా చొరవతో హృతిక్ తోనే దర్శకత్వం చేయించాలని నిర్ణయించుకోవడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు మారిపోయాయి.
ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీక్స్ ముంబై వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం క్రిష్ 4లో హృతిక్ రోషన్ ట్రిపుల్ రోల్ చేస్తాడని తెలిసింది. హీరోగా, విలన్ గా, మరొకటి క్రిష్ తండ్రి పాత్రగా కోయి మిల్ గయా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారని తెలిసింది. ఇది నిజమో కాదో కానీ వినడానికి మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. క్రిష్, క్రిష్ 3 లో నటించిన రేఖ, ప్రియాంకా చోప్రా, వివేక్ ఒబెరాయ్, ప్రీతీ జింటా తదితరులు ఇందులో భాగం కాబోతున్నారు. కొత్త ఫ్రాంచైజ్ కి హీరోయిన్ సస్పెన్స్ పెట్టారు. కియారా అన్నారు కానీ ఇప్పుడు లేదట. నోరా ఫతేహికి ఒక కీలక రోల్ దక్కిందని టాక్.
చూస్తుంటే క్రిష్ 4 ఓ రేంజ్ లో తయారయ్యేలా ఉంది. బడ్జెట్ సైతం మూడు వందల కోట్లకు పైగానే కేటాయించబోతున్నట్టు తెలిసింది. బాలీవుడ్ లో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఉన్న బ్లాక్ బస్టర్స్ రాలేని లోటుని క్రిష్ 4తో తీర్చాలని హృతిక్ మంచి పట్టుదలతో అన్ని పనులు తానే చూసుకుంటున్నాడట. వార్ 2 తర్వాత పూర్తి సమయం దీనికే కేటాయించబోతున్నాడు. ఇతర దర్శకులు వచ్చి కలుస్తున్నా, కథలు చెబుతున్నా వాటి పట్ల ఆసక్తి చూపించడం లేదని ఇన్ సైడ్ టాక్. వేసవి తర్వాత షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆర్టిస్టుల డేట్లు ఫైనలయ్యాక నిర్ణయం తీసుకుంటారు.
This post was last modified on April 9, 2025 10:28 am
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు…
వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసడర్ గా పని…
ఇటీవలే విడుదలైన కేసరి చాఫ్టర్ 2కి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మూడుకు తక్కువ రేటింగ్స్ దాదాపుగా ఎవరూ…
ఐపీఎల్ 2025లో ఓ మ్యాచ్ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో…