జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్ రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ట్వీట్లు వచ్చేశాయి. అయితే అది దేని గురించనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ముందు చెప్పినట్టు విడుదలని 2026 సంక్రాంతికి కాకుండా ఒక మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ లో తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 లాక్ చేశారని, అదే రేపు ప్రకటన రూపంలో వెలువడే ఛాన్స్ ఉందట. అంటే సరిగ్గా పన్నెండు నెలల తర్వాత వస్తుందన్న మాట.
దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ఇదే టైటిల్ తో చేసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. తిరిగి అదే పెట్టుకుంటే ఇబ్బంది కావొచ్చు. తెలుగు డబ్బింగ్ కి రిటర్న్ అఫ్ ది డ్రాగన్ అని పెట్టి మేనేజ్ చేశారు కానీ జనం మెదడులో మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగా రిజిస్టర్ అయిపోయింది. సరే దీని సంగతలా ఉంచితే ఏప్రిల్ 9 చాలా మంచి డేట్. వేసవి సీజన్ తో పాటు వరస సెలవులు కలిసి వస్తాయి. గతంలో కెజిఎఫ్ 2 కూడా ఇదే నెలలో వచ్చి ఆల్ ఇండియా లెవల్ లో భారీ వసూళ్లు దక్కించుకుంది.
ఇప్పటికైతే ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ పెద్ద సినిమాలు ఖచ్చితంగా చెప్పిన మాటకే కట్టుబడి అదే డేట్ కి వస్తాయన్న గ్యారెంటీ లేదు. వాయిదాలు టాలీవుడ్ లో మాములు ప్రహసనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9న తారక్ నీల్ వంద శాతం వస్తారా అంటే నిర్మాతలు సైతం చెప్పలేరు. ప్లానింగ్ అయితే పక్కాగా దానికి అనుగుణంగానే జరుగుతోంది. ఇది పూర్తి చేసి దేవర 2 మొదలు పెట్టాలనేది తారక్ – కొరటాల శివ ప్రణాళిక. అంటే ఫిబ్రవరి లోగా నీల్ మూవీని కంప్లీట్ చేయగలిగితే ఒక నెల ప్రమోషన్ల కోసం కేటాయించవచ్చు. ఏదైతేనేం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతోంది.
This post was last modified on April 8, 2025 10:33 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…