మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రమోషన్ల విషయంలో మౌనం పాటిస్తూ వచ్చిన విశ్వంభర ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని మెగా వర్గాల సమాచారం. గత ఏడాది ఆగస్ట్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వదిలిన టీజర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చాక టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి విఎఫెక్స్ ని సరిదిద్దే పనిలో పడి విడుదల తేదీ నిర్ణయించుకోలేరు. ఒకదశలో మే 9 అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఇప్పుడదే స్లాట్ లో హరిహర వీరమల్లు వస్తోంది. సో విశ్వంభరని ఎప్పుడు వదులుతారనే భేతాళ ప్రశ్నకు సమాధానం దొరికిందట.
ఈ విజువల్ గ్రాండియర్ ని జూలై 24 విడుదల చేయాలని యువి సంస్థ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దీనికి ఇంద్రకు కనెక్షన్ ఏంటంటే 2002లో టాలీవుడ్ రికార్డులను హోరెత్తిపోయేలా బద్దలుకొట్టిన ఆ బ్లాక్ బస్టర్ వచ్చింది కూడా ఈ డేట్ కే. అందుకే మెగా ఫ్యాన్స్ దీన్ని చాలా స్పెషల్ గా ఫీలవుతారు. ఏప్రిల్ 12 నందిగామలోని హనుమాన్ విగ్రహం దగ్గర మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారని వినికిడి. శ్రీరాముడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ పాటలో చిరంజీవితో పాటు సాయిధరమ్ తేజ్ ఆడిపాడటం విశేషం. విశ్వంభర ప్రమోషన్లకు దీంతోనే శ్రీకారం చుట్టబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్.
ఏదైతేనేం మొత్తానికి గుడ్ న్యూస్ వచ్చింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి దీన్ని నిర్ధారించలేం కానీ ప్రాథమికంగా అందిన సమాచారం ఖరారనే చెబుతోంది. ఇక బజ్ పెంచే ప్రయత్నాలు దర్శకుడు వసిష్ఠ బృందం మొదలుపెట్టాలి. ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల హైప్ తగ్గిపోయింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటల గురించి ఇన్ సైడ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. ఒకప్పుడు ఘరానా మొగుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చిన కాంబో కావడంతో మరోసారి ఆ మేజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటించగా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కీలకం కానున్నాయి.
This post was last modified on April 8, 2025 3:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…