అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో అన్నీ ఉండి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది అంటే సుమంతే. నాగేశ్వరరావుకు మనవడు, నాగార్జునకు మేనల్లుడు అయిన సుమంత్ రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సత్యం, గోదావరి, మళ్ళీ రావా లాంటి మంచి సినిమాలు అతడి నుంచి వచ్చాయి. కానీ నిలకడగా ఎప్పుడూ విజయాలందుకున్నది లేదు. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నదీ లేదు.
త్వరలోనే అతను ‘కపటధారి’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా కోసం సుమంత్ లుక్ మార్చాడు. పోలీస్ పాత్ర కావడంతో బాడీ మరింత పక్కాగా తీర్చిదిద్దుకున్నాడు. క్లీన్ షేవ్‌తో కనిపించాడు. ఇటీవలే రిలీజైన దీని టీజర్ కూడా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఐతే తన తర్వాతి చిత్రం విషయంలో సుమంత్ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. కానీ ఉన్నట్లుండి నెవర్ బిఫోర్ అవతారంలోకి మారిన కొత్త లుక్‌ను ట్విట్టర్లో షేర్ చేసి అందరికీ పెద్ద షాకిచ్చాడు సుమంత్. సుమంత్ ఎక్కువగా క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. లేదంటే లైట్ గడ్డంతో ఉంటాడు. కానీ ఇందులో మాత్రం గడ్డం, అది కూడా బాగా నెరిసి రఫ్‌గా కనిపిస్తున్నాడు సుమంత్. హేర్ స్టైల్ కూడా మారింది. జుట్టు పొట్టి అయింది. మీసం కూడా బాగా పెంచి, బొట్టు పెట్టి చేతికి కడియాలు.. నల్ల చొక్కా, ఎర్ర లుంగీతో సరికొత్తగా తయారయ్యాడు సుమంత్. ఈ ఫొటోకు ‘అనగనగా ఒక రౌడీ’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు సుమంత్.
దీన్ని బట్టి తన కొత్త సినిమాలో రౌడీ పాత్ర చేయబోతున్నాడని అర్థమవుతోంది. సుమంత్ ఇలా ఊర మాస్‌గా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇది అతడికి పాత్రతో పాటు లుక్ పరంగానూ భలే మేకోవర్‌లాగా అనిపిస్తోంది. ఇంతకీ ఇది ఏ సినిమా లుక్ అన్నది మాత్రం సస్పెన్సులో పెట్టేశాడు అక్కినేని హీరో.
This post was last modified on November 1, 2020 7:18 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…