తెలుగమ్మాయిలకు తెలుగులో ఆశించిన అవకాశాలు రావు కానీ.. వాళ్లు వేరే భాషల్లోకి వెళ్లి సత్తా చాటుతుంటారు. అంజలి, ఆనంది, శ్రీదివ్య, కలర్స్ స్వాతి లాంటి వాళ్లు తమిళంలో ఎంత మంచి పేరు సంపాదించారో తెలిసిందే. ఐతే తెలుగుమ్మాయిలు ఎక్కువగా తమిళంలోకే వెళ్తుంటారు కానీ.. హిందీలో అవకాశాలు అందుకోవడం మాత్రం అరుదే.
ముందు తరంలో జయప్రద, శ్రీదేవి లాంటి వాళ్లు ఇందుకు మినహాయింపు. తర్వాతి తరంలో హిందీలో ఛాన్సులు సంపాదించిన వాళ్లు కనిపించరు. ఐతే ఇప్పుడు అనన్య నాగళ్ళ బాలీవుడ్ ఛాన్స్ అందుకోవడం విశేషం. తెలుగులో ఎక్కువగా చిన్న సినిమాలే చేసిన ఈ అమ్మాయికి ఇప్పుడు బాలీవుడ్ మూవీలో అవకాశం అందుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ పేరున్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏక్తా ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో అనన్య తొలి హిందీ చిత్రం చేస్తుండడం విశేషం. పైగా ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అట. రాకేశ్ జగ్గి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో అనన్య గిరిజన యువతిగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేస్తోందట.
అనన్య తెలుగులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో రాణిస్తూనే.. తనలోని గ్లామర్ కోణాన్ని కూడా చూపించింది. మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఐతే అవకాశాలకు లోటు లేకపోయినా.. ఆమె చేస్తున్నవి చిన్న సినిమాలు కావడంతో ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ ఛాన్స్ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూాడాలి.
This post was last modified on April 7, 2025 3:19 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…