Movie News

సల్మాన్ సినిమా పరిస్థితి ఎంత ఘోరమంటే?

బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల కోట్ల వసూళ్లు వచ్చేసేవి. కానీ ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ఆమిర్ ఖాన్ సైతం ‘లాల్ సింగ్ చడ్డా’తో ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాడో తెలిసిందే. సల్మాన్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇంతే దయనీయంగా తయారైంది. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాల నుంచి ‘సికందర్’ మూవీతో బయటపడతాడనుకుంటే.. ఇంకా కిందికి పడిపోయాడు కండల వీరుడు.

సౌత్ సీనియర్ డైరెక్టర్ మురుగదాస్ రూపొందించిన చిత్రం.. సల్మాన్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. తొలి రెండు మూడు రోజుల్లో ఓపెనింగ్స్ వరకు పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఆరో రోజైన శుక్రవారం ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా కేవలం రూ.3 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇండియాలో ఈ సినిమా ఓవరాల్ ఆక్యుపెన్సీ కేవలం 6 శాతం కావడం గమనార్హం. సల్మాన్ సినిమాకు ఆరో రోజు ఇంత దారుణమైన ఆక్యుపెన్సీ రావడం అంటే పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒకప్పుడు సల్మాన్ మూవీకి రెండు మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు వచ్చేసేవి. కానీ వారం అవుతున్నా ఈ చిత్రం ఆ మార్కును అందుకోవడానికి కష్టపడుతోంది.

రెండో వీకెండ్లో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారంతో థియేట్రికల్ రన్ ముగిసిపోయినట్లే. ఈ చిత్రానికి సల్మాన్ రూ.120 కోట్ల పారితోషకం తీసుకున్నాడట. థియేటర్ల నుంచి కనీసం తన రెమ్యూనరేషన్ కూడా వెనక్కి రాని పరిస్థితి. నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా కొంత సేఫ్ అవుతున్నాడు. కానీ సినిమాను కొన్ని బయ్యర్లు మాత్రం మునిగినట్లే.

This post was last modified on April 6, 2025 8:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago