Movie News

ఎస్ఎస్ఎంబి 29 – సీక్వెల్ ఉంటుందా ఉండదా

టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకుంది. కేరళ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఆఫ్రికాలో ప్లాన్ చేసుకున్న లాంగ్ షెడ్యూల్ కు అనుమతులు, వీసాలు కుదరగానే ప్రయాణం తేదీని నిర్ణయించబోతున్నారు.  ఇప్పటిదాకా ఫిక్స్ అయిన క్యాస్టింగ్ లో పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పేర్లు మాత్రమే బయటికి రాగా ఇంకెవరెవరు ఉన్నారనేది గుట్టుగానే ఉంది. ఇదిలా ఉండగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ ప్యాన్ వరల్డ్ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో రాజమౌళి లేరట. కాస్త నిడివి ఎక్కువైనా సరే యానిమల్, పుష్ప తరహాలో ఓ మూడున్నర గంటలు సెట్ చేసినా పర్వాలేదు కానీ సీక్వెల్ కోసం ప్రయాస అవసరం లేదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దీనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అసలీ సినిమా మొదలుకాక ముందే పార్ట్ 2 గట్రాలు వద్దనుకున్నారని సమాచారం. అయితే అధికారికంగా ఏదీ ఇంకా బయటికి చెప్పలేదు కాబట్టి నిర్ధారణకు రాలేం కానీ అభిమానులు, సినీ ప్రియులు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా అఫీషియల్ కాలేదు. ఓ రెండు నిమిషాల వీడియోని సిద్ధం చేసి ప్రాజెక్టుని ప్రకటించే ప్రణాళిక రెడీ అవుతోందట. అది ఎప్పుడనేది జక్కన్న చెబితే తప్ప కనీసం లీక్ అవ్వడం కూడా కష్టమే. మహేష్ బాబు విదేశీ పర్యటనలు దూరం పెట్టి మరీ రాజమౌళి కోసం అంకితమైపోయాడు. 2027 విడుదల చేయాలనేది నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ లక్ష్యం. చూస్తుంటే సాధ్యమయ్యేలానే ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ కి మైథలాజి జోడించి విజయేంద్రప్రసాద్ చాలా పవర్ ఫుల్ స్టోరీ ఇచ్చారట. వెయ్యి కోట్ల విజువల్ గ్రాండియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

This post was last modified on April 3, 2025 8:02 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

4 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

6 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago