Movie News

అరియానాకి ఎర్త్ పెట్టిన బిగ్‍బాస్‍?

ఈ సీజన్‍ బిగ్‍బాస్‍లో సరిగ్గా ఆడుతోన్న కంటెస్టెంట్‍ ఒక్కరూ లేరంటే రాంగ్‍ స్టేట్‍మెంట్‍ కానే కాదు. దీంతో ఆడియన్స్ కూడా ఫ్లిప్‍ అవుతూ రెండు వారాలకో కొత్త ఫేవరెట్‍ను వెతుక్కుంటున్నారు. దివి, సోహైల్‍ తర్వాత ఇప్పుడు అరియానాకు ఓట్లు ఎక్కువగా వేస్తున్నారు. నిజానికి ఈ యాంకర్‍ అక్కడ ఆడుతున్నదేమీ లేదు. మొదట్నుంచీ ఆమె ఆట కెమెరాల కోసమే ఆడుతూ వచ్చింది.

సింపతీ గెయిన్‍ చేసే ఏ పాయింట్‍నీ ఆమె విడిచిపెట్టదు. అవసరం వున్నా లేకపోయినా వుమన్‍ కార్డ్ వాడకుండా వుండదు. అవతలి వారి తప్పులను ఎన్నడానికి ముందుంటుంది. అలాగే తన తప్పులను ఎవరైనా ఎత్తి చూపిస్తే మాత్రం అక్కడ్నుంచి వాకౌట్‍ చేసేస్తుంది. విక్టిమ్‍ కార్డ్ ప్లే చేసి ఆడియన్స్ సింపతీ కోసం చూస్తుంటుంది. ఇలాంటి అవ లక్షణాలు ఎన్ని వున్నా కానీ షో ఫాలోవర్స్ మాత్రం ఆమె ట్రాప్‍లో పడిపోయారు. బిగ్‍బాస్‍ డైరెక్టర్లు అరియానా గ్రాఫ్‍ పెరగడం గమనించారు. అలాగే హౌస్‍లో ఎవరూ కూడా ఆమెను సీరియస్‍ కంటెండర్‍గా కన్సిడర్‍ చేయకపోవడం కూడా తెలుసుకున్నారు.

అందుకే అరియానా ఏమిటనేది తెలియజేయడానికి రేషన్‍ మేనేజర్‍ విషయంలో ఆమె ఫ్లిప్పింగ్స్ చూపించారు. ఇకపోతే నోయెల్‍ని ఆరోగ్య కారణాలతో బయటకు పంపించారు. అతను త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాడు. బయటి విషయాలేమిటనేది తెలుసుకుని వస్తాడు కనుక మిగతా కంటెస్టెంట్లు అలర్ట్ అవుతారు. గతంలో కౌశల్‍ విషయంలో క్లూస్‍ ఇవ్వడానికి సామ్రాట్‍ని అలాగే బయటకు పంపించి మళ్లీ లోనికి తీసుకొచ్చారు. ఈసారి ఇక వైల్డ్ కార్డ్లు ఏమీ లేవు కనుక నోయెల్‍ని ఇలా వాడుతున్నట్టున్నారు.

This post was last modified on October 31, 2020 8:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

21 seconds ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

6 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

9 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

10 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

10 hours ago