డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో రెడీ అవుతున్నాడు. విడుదల తేదీ అధికారికంగా ప్రకటించనప్పటికీ డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు ఏప్రిల్ 18 సిద్ధం కమ్మని సమాచారం వచ్చిందట. కాకపోతే అఫీషియల్ గా అనౌన్స్ చేసే ముందు మరోసారి చర్చించుకోనున్నట్టు సమాచారం. అనుష్క ఘాటీ ఆ డేట్ నుంచి తప్పుకున్నాక ఆ అడ్వాంటేజ్ ఇద్దరు తీసుకున్నారు. ఒక రోజు ముందు తమన్నా ఓదెల 2ని రంగంలో దించుతుండగా మరుసటి తేదీకి ప్రియదర్శి సారంగపాణి జాతకం వచ్చేస్తోంది. ఈ రెండింట్లో ఒకటి డివోషనల్ హారర్ కాగా రెండోది ఎంటర్ టైన్మెంట్ మూవీ.
సో మాస్ కు సరైన ఆప్షన్ లేదు. అందుకే కళ్యాణ్ రామ్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 18 మంచి ఆప్షన్. పిల్లలు సెలవుల్లో ఉంటారు. థియేటర్లకు ఫీడింగ్ బాగా జరిగే సీజన్ ఇది. మొన్న మ్యాడ్ స్క్వేర్ చూశాంగా. వీకెండ్ మూడు రోజులు కలెక్షన్లు లాగేసి బ్రేక్ ఈవెన్ అందుకుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో ఉన్నది ప్యూర్ మాస్ కంటెంట్. విజయశాంతి రూపంలో బలమైన మదర్ సెంటిమెంట్ పెట్టారు. ఫైట్లు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్లు ఒకటేమిటి అన్ని మసాలాలు ప్రాపర్ గా కుదిరాయి. ట్రైలర్ కట్ అయిపోయింది. డేట్ లాక్ చేసుకుంటే ఇది ఎక్కడ లాంచ్ చేయలేనిది నిర్ణయించుకుంటారు.
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ తర్వాత టాలీవుడ్ లో సరైన మాస్ సినిమా రాలేదు. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, తండేల్ విజయం సాధించినా వాటి టార్గెట్ ఆడియన్స్ వేరు. వాళ్లనే అవి మెప్పించాయి. కానీ అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మాస్ ఎడ్జ్ ఉంది. కాకపోతే సినిమాలో కంటెంట్ రొటీన్ అనిపించకుండా అందరికి కనెక్ట్ అవ్వాలి. కళ్యాణ్ రామ్ రంగంలోకి దిగి ప్రమోషన్లు పరిగెత్తిస్తున్నాడు. అనిల్ రావిపూడితో కలిసి తాను, విజయశాంతి కాంబోలో ఒక ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. మరికొన్ని ఈ వారంలో జరగబోతున్నాయి. దేవర తర్వాత నందమూరి ఫ్యాన్స్ కోసం వస్తున్న థియేటర్ మూవీ ఇదే.
This post was last modified on April 3, 2025 2:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…