జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటిసారి జపాన్ దేశానికి వెళ్లి ప్రత్యేకంగా ప్రమోట్ చేసిన దేవర మొన్న మార్చి 28 విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసమే ప్రత్యేకంగా తారక్ తో పాటు దర్శకుడు కొరటాల శివ అక్కడి పబ్లిసిటీలో భాగమయ్యారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాక ఫ్యాన్స్ మీట్స్ నిర్వహించి ప్రత్యేకంగా కబుర్లు పంచుకున్నారు. ఫోటో షూట్ తాలూకు పిక్స్ వైరలయ్యాయి. కాకపోతే కల్కికి పెద్దగా స్పందన దక్కని నేపథ్యంలో దేవరకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం గొప్పగా లేదు కానీ డీసెంట్ గా నడుస్తోందట.
జపాన్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవర మొదటి రెండు రోజుల్లో 11 మిలియన్ యెన్లు (అక్కడి కరెన్సీ) వసూలు చేసింది. సుమారు 6200 మంది దాకా థియేటర్లకొచ్చి దేవరని చూశారు. అయితే లాంగ్ రన్ లో ఇది కొనసాగితేనే బ్లాక్ బస్టర్ ముద్ర పడుతుంది. ఇప్పటిదాకా హయ్యెస్ట్ లెక్కలు చూస్తే ఆర్ఆర్ఆర్ (2.42 బిలియన్), ముత్తు (405 మిలియన్), బాహుబలి 2 (305 మిలియన్) తో టాప్ త్రీ పొజిషన్లలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఉన్నవన్నీ 200 మిలియన్ లోపే ఉన్నవి. ఇప్పుడు దేవర ఇంకా ప్రారంభంలోనే ఉంది కానీ 11 అనేది రేంజ్ ప్రకారం చూసుకుంటే చిన్న నెంబరే.
ప్రస్తుతానికి తారక్ హ్యాపీగానే ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతోంది. జపాన్ ఫైనల్ రన్ పూర్తయితే తప్ప స్టేటస్ డిసైడ్ చేయలేం కానీ ఇంకా మెరుగ్గా కలెక్షన్లు ఉండాల్సిందన్న మాట వాస్తవం. దేవర 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఉంటుందా లేదానే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే వార్ 2 అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది కాగానే నెల్సన్ దిలీప్ కుమార్ ప్యాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఇవన్నీ అయ్యేలోగా రెండు మూడేళ్లు గడిచిపోతాయి. మరి దేవర 2 అప్పటిదాకా ఎదురు చూస్తే ఈ హైప్ తగ్గొచ్చు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on April 3, 2025 2:13 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…