డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వరస బ్లాక్ బస్టర్లు ఇచ్చాక ఏడాది పైనే గ్యాప్ వచ్చేసిన సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా జాక్ ఏప్రిల్ 10 విడుదలకు రెడీ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా సిద్ధూ మొదటిసారి లవ్, రొమాంటిక్ జానర్ నుంచి బయటికి వచ్చి సీరియస్ టర్న్ తీసుకున్నాడు. అలాని ఫన్ వదిలేయలేదు కానీ కొత్తగా అయితే ట్రై చేస్తున్నాడు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ ద్వారా ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో గుట్టు విప్పేశారు.
దేశంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా వివిధ ప్రాంతాల్లో నలుగురు కరుడు గట్టిన టెర్రరిస్టులు పాతుకుని పోయి కుట్రలకు ప్లాన్ చేస్తారు. ఇది తెలుసుకున్న సీక్రెట్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ (ప్రకాష్ రాజ్) వాళ్ళను పట్టుకునే లక్ష్యంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకోవైపు బయటి ప్రపంచానికి జాలిగా కనిపించే జాక్ (సిద్ధూ జొన్నలగడ్డ) రకరకాల మరువేషాలతో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటాడు. ఓ అమ్మాయి (వైష్ణవి చైతన్య) ని ప్రేమలో కూడా పడేస్తాడు. అసలు జాక్ కి ఈ మిషన్ కి సంబంధం ఏంటి, కనిపించకుండా గొంతులు కోసే తీవ్రవాదులను పట్టుకోవడంలో ఏం చేశాడనేది ఇంకో వారంలో తెరమీద చూడాలి.
కంటెంట్ పరంగా జాక్ లో వైవిధ్యం కనిపిస్తోంది. తీసుకున్నది తీవ్రమైన బ్యాక్ డ్రాపే అయినా సిద్దు మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్దు చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేష్ తో పండించిన హాస్యం యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా అచ్చురాజమణి పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయాయి. కొంచెం క్రాక్ క్యాప్షన్ పెట్టుకుని వస్తున్న జాక్ అంచనాలు రేపడంలో సక్సెసయ్యాడు. ఇక సినిమాతో మెప్పించడమే మిగిలింది.
This post was last modified on April 3, 2025 11:20 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…