పవన్ కళ్యాణ్ అవీ ఇవీ మొదలు పెడుతున్నాడు కానీ గబ్బర్‍సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‍తో సినిమా అనౌన్స్ చేసి కూడా అది మొదలు పెట్టడేంటని ఫాన్స్ అసహనానికి గురవుతున్నారు. హరీష్ శంకర్ కూడా పవన్ పుట్టినరోజుకి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసి ఫాన్స్ని మరీ ఊరించాడు. ఆ పోస్టర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హరీష్‍ని పిలిపించి కథ సిద్ధమయిందా అని అడిగాడట.
అయితే హరీష్ దగ్గర ఇంకా పూర్తి కథ రెడీ కాలేదట. గబ్బర్‍సింగ్ తర్వాత తమ కాంబినేషన్లో సినిమా కనుక అంచనాలు తారాస్థాయిలో వుంటాయనేది హరీష్ శంకర్‍కి తెలుసు. అందులోను రామయ్యా వస్తావయ్యా, డిజె తర్వాత స్టార్ హీరోలు అతని దర్శకత్వంలో నటించడానికి అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదు. అందుకే దర్శకుడిగా ఈ చిత్రం అతనికి పెద్ద సవాల్.
మరోసారి ఇండస్ట్రీ తనవైపు తిరిగి చూసేలా గబ్బర్‍సింగ్‍ని తలదన్నే సినిమా తీయాలనేది హరీష్ శంకర్ లక్ష్యం. అందుకే పవన్‍కళ్యాణ్‍ని తొందరపెట్టి ఏదో ఒక సినిమా చేసేయాలని చూడకుండా వీలయినంత సమయం తీసుకుని పకడ్బందీ కథతో రావాలని నిర్ణయించుకున్నాడు.
This post was last modified on October 31, 2020 8:00 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…