మ్యాడ్ సిరీస్ లో ఎక్కువ పేరు వచ్చింది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సంగీత్ శోభన్. మూడేళ్ళలో ఇతను చేసింది రెండు సినిమాలే. రెండోది కూడా మొదటిదాని సీక్వెల్. నితిన్ నార్నెకు హీరో పరంగా కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ జనంలో బాగా నానింది మాత్రం దామోదర్ అలియాస్ డిడి. నలుగురు కుర్రాళ్ళలో ఒకడిగా తనదైన టైమింగ్ తో అలరించిన తీరు అభిమానులను సంపాదించి పెట్టింది. మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ పోస్టర్లలో తనను సైడ్ చేశారని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడితే ప్రొడక్షన్ హౌస్ దానికి స్పందించి పబ్లిసిటీ కంటెంట్ మార్చిందంటే ఎంత రీచో వేరే చెప్పాలా.
ఇదిలా ఉండగా సంగీత్ శోభన్ సోలో హీరో అయిపోయాడు. కమిటీ కుర్రాళ్లతో నిర్మాతగా తొలి సూపర్ హిట్ అందుకున్న నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో మానస వర్మ దర్శకత్వంలో ఒక్కడే కథానాయకుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే షూట్ మొదలుపెట్టబోతున్నారు. అసలైన సవాల్ డిడికి ఇప్పుడు మొదలుకానుంది. అన్నయ్య సంతోష్ శోభన్ సక్సెస్ కావడానికి స్ట్రగుల్ అవుతున్న చోట తాను గెలిచేందుకు మార్గం ఏర్పడింది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది. కథలు కాంబోల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటే మంచి కెరీర్ టాలీవుడ్లో ఏర్పడుతోంది.
క్యాస్టింగ్, టీమ్ ఇతరత్రా వివరాల ఇంకా చెప్పలేదు కానీ రొమాంటిక్ కామెడీ జానరని వినిపిస్తోంది. హాస్యం పండించడంతో సంగీత్ శోభన్ కు మంచి పేరొచ్చింది. దాన్ని మరింత పెంచుకునేలా వీలైనంత ఎంటర్ టైనర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. తనకు నప్పని మాస్ జోలికి వెళ్లకుండా కేవలం కంటెంట్ ని సీరియస్ గా తీసుకుంటే చాలు. ఇంతకు ముందు ప్రేమ విమానం, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి ఓటిటి మూవీస్ చేసినప్పటికీ సంగీత్ కు ఆశించిన పేరు రాలేదు. ఇప్పుడు థియేటర్ హీరోగా మారిపోయి సోలోగా దిగుతున్నాడు కాబట్టి ప్రతి అడుగు ముళ్లబాట లాంటిదే. ఇంకో రెండు సినిమాల ప్రకటనలు త్వరలో రాబోతున్నాయట.
This post was last modified on April 2, 2025 3:28 pm
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2…
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ…