Movie News

సూపర్ స్టార్ల గాలి తీసేస్తున్నారే..

ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. బాలీవుడ్‌ను రెండు దశాబ్దాలకు పైగా ఏలుతూ వచ్చిన సూపర్ స్టార్లు. అమితాబ్ బచ్చన్ హవా తగ్గాక ఇండియన్ బాక్సాఫీస్‌లో వీరిదే హవా. ఖాన్ త్రయంలో ఎవరికి వాళ్లు భారీ విజయాలందుకుని తమకు తామే సాటి అని రుజువు చేశారు. ఐతే వీరిలో షారుఖ్ ఖాన్ ఒక దశలో వరుస డిజాస్టర్లలో అల్లాడిపోయాడు. ఆయన కెరీర్‌కు ‘పఠాన్’ మళ్లీ ఊపిరి పోసింది. జవాన్ సైతం బ్లాక్ బస్టర్ అయింది. ‘డంకీ’ ఓ మోస్తరుగా ఆడింది. కానీ మిగతా ఇద్దరు ఖాన్స్ మాత్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

‘దంగల్’ తర్వాత ఆమిర్ ఖాన్‌కు హిట్ లేదు. మూడేళ్లకో సినిమా చేసే ఆమిర్.. కష్టపడి చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ‘లాల్ సింగ్ చడ్డా’కు అయితే మినిమం ఓపెనింగ్స్ లేవు. ఆయన స్టార్ డమ్ అంతా ఏమైందో అనిపించేలా ఘోరమైన ఫలితాన్నందుకుందీ చిత్రం.

ఈ దెబ్బతో ఆమిర్ హీరోగా కొత్త సినిమానే మొదలుపెట్టలేదు. రెండేళ్ల పాటు అసలు సినిమాలకే దూరమైపోయాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ‘సితారే జమీన్ పర్’ తీస్తున్న ఆమిర్.. హీరోగా మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడో తెలియని పరిస్థితి. ఇక సల్మాన్ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. ఆయన చివరగా ఎప్పుడు నిఖార్సయిన హిట్ కొట్టాడో కూడా ఫ్యాన్స్‌కు గుర్తు లేదు. తన సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ కండల వీరుడి చివరి చిత్రం ‘కిసీ కా భాయ్ కిసి కీ జాన్’ డిజాస్టరే. లేటెస్ట్ మూవీ ‘సికందర్’ ఫలితం చూశాక ముందు సినిమాలే నయం అనిపిస్తోంది. సల్మాన్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది.

తొలి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత సినిమా చతికిలపడింది. ఇంతకుముందులా బాలీవుడ్ ప్రేక్షకులు స్టార్ల ముఖాలు చూసి సినిమాలకు ఎగబడే పరిస్థితి లేదనడానికి ‘సికందర్’ రుజువు. వారం తిరక్కముందే జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఆమిర్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’కు సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద స్టార్లుగా పేరు తెచ్చుకున్న హీరోలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

This post was last modified on April 1, 2025 7:32 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

26 minutes ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

1 hour ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago