‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేయడమంటే అంత తేలికైన విషయమేమీ కాదు. కంటెస్టెంట్లు అందరి మీదా ఒక అవగాహన ఉండాలి. వీకెండ్ ఎపిసోడ్‌ను హోస్ట్ చేయాలంటే.. ఆ వారంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. షో వ్యవహారం మీద అవగాహన ఉండాలి. టాస్కులు, ఇతర విషయాల మీద కూడా పట్టుండాలి. కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం ఇవేవే తెలియకుండానే షోను హోస్ట్ చేసేసిందట. ఈ విషయాన్ని సమంతే స్వయంగా వెల్లడించడం విశేషం.
గత సీజన్‌తో పాటు ఈసారి కూడా ‘బిగ్ బాస్’కు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం అనివార్యంగా ‘బిగ్ బాస్’కు కొన్ని వారాలు దూరం కావాల్సి రావడంతో నాగార్జున స్థానంలోకి సమంత వచ్చింది. గత వారం ఆమే షోను హోస్ట్ చేసింది. ఆమె హోస్టింగ్ స్కిల్స్ సూపర్ అనలేం. అలా అని తీసిపడేయలేం. ఓకే అనిపించింది. ఐతే ఏమాత్రం అనుభవం లేకుండా, బిగ్ బాస్ షో మీద అవగాహన లేకుండా సమంత ఈ మాత్రం నడిపించిందంటే గొప్ప విషయమే.
ఈ అనుభవం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
‘‘ఇది ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ అనుభవం. బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మా మావయ్య వల్లే హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసే ముందు ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా చేయలేదు. నాకు తెలుగు పెద్దగా రాదు. అంతే కాదు.. ఇంతకుముందు బిగ్‌బాస్‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అయినా నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామా. అలాగే ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని సమంత పేర్కొంది.
This post was last modified on October 30, 2020 10:27 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…