ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన భారీ సిరీస్‌లు చాలా ఉన్నాయి కానీ.. కంటెంట్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ పరంగా చూస్తే ఇదే నంబర్ వన్ స్థాయిలో నిలుస్తుంది. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంది. తర్వాత రెండో సీజన్ రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్‌లో సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండో సీజన్ చివర్లో మూడో సీజన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లడానికి కొంచెం టైం పట్టింది.
గత ఏడాది చివర్లో షూట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం జోరుగా చిత్రీకరణ జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్-2 గురించి హీరో మనోజ్ బాజ్‌పేయి రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చాడు ఓ ఇంటర్వ్యూలో. ‘పాతాళ్ లోక్’తో మంచి పేరు సంపాదించిన జైదీప్ అహ్లావత్ ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడట. గత ఏడాదే అతను షూట్‌లో జాయిన్ అయ్యాడని.. తన పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని మనోజ్ తెలిపాడు.
ఇక ఈ సిరీస్ రిలీజ్ టైమింగ్‌ను కూడా మనోజ్ వెల్లడించాడు. ఈ ఏడాది నవంబరు నుంచి అమేజాన్ ప్రైమ్ వాళ్లు దీన్ని స్ట్రీమ్ చేస్తారన్నాడు. పార్ట్-3 అరుణాచల్ ప్రదేశ్ నేపథ్యంలో సాగుతుందని.. చైనా వాళ్లతో హీరో పోరాడతాడని సెకండ్ పార్ట్ చివర్లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ స్ట్రీమ్ అయినపుడు ఓటీటీ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు. జైదీప్ కూడా తోడవుతుండడంతో ఈ సిరీస్ హైప్ ఇంకో లెవెల్‌కు చేరడం ఖాయం.
This post was last modified on March 29, 2025 11:02 pm
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…
మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో చిరు తర్వాతి సినిమా…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రహస్యాలు, చీకటి కోణాలు, బయటకు రాని మర్మాలు అంటూ ఏవీ ఇక…