రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి. సౌత్ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్, విజయ్, సూర్య సినిమాలను నార్త్ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారని, కానీ దక్షిణాదిలో మాత్రం తనను భాయ్ భాయ్ అంటూ థియేటర్లకు మాత్రం రావడం లేదని అన్నాడు. అంటే తమ మీద ఇష్టం కేవలం బయటికి పరిమితమవుతుందని, అంతే తప్ప కలెక్షన్లుగా మారడం లేదని కండల వీరుడి సారాంశం. అయితే వినడానికి బాగానే ఉంది కానీ సల్మాన్ ఖాన్ కొన్ని కీలకమైన లాజిక్స్ మిస్ అవుతున్నాడు.
తెలుగు ఆడియన్స్ హిందీ చిత్రాలను ఆదరించడం ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ లో డాన్, షోలే, దీవార్ లాంటి బ్లాక్ బస్టర్లు సాధించిన రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. హం ఆప్కే హై కౌన్ డబ్బింగ్ వెర్షన్ వైజాగ్ లాంటి కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడటం గురించి అప్పటి ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే కింది స్థాయి సెంటర్లలో హండ్రెడ్ డేస్ ఆడింది. సరే అవన్నీ పాతవి అనుకుంటే జవాన్, పఠాన్ లు నమోదు చేసిన వసూళ్లు చిన్నవి కాదు. యానిమల్ ని నెత్తిన బెట్టుకున్నది మనమే. తీసింది కూడా మన దర్శకుడే. వీటికి సమాధానం సల్మానే చెప్పాలి.
కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆదరించడం సౌత్ ప్రేక్షకులకు తరాల నుంచి వస్తున్న సినిమా ప్రేమ. ఇవన్నీ కాదు సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ కు మనోళ్లు ఎంత భారీ వసూళ్లు ఇచ్చారో ఒక్కసారి కలెక్షన్ ఛార్ట్ తీసి చూస్తే అర్థమవుతుంది. బాలేనప్పుడు మనకు సూపర్ స్టార్ అయినా ఒకటే భాయ్ జాన్ అయినా ఒకటే. రేస్ 3, ట్యూబ్ లైట్, రాధే, కిసీకా భాయ్ కిసీకా జాన్ లాంటి డిజాస్టర్ కళాఖండాలు ఇస్తూ నన్ను చూడటం లేదని వాపోతే ఎవరికి నష్టం. ఏదో స్టేట్ మెంట్ అనేస్తే పడి ఉంటుందిలే అనుకుంటే ఇలాంటి వంద కౌంటర్లు ప్రశ్నల రూపంలో రివర్స్ లో వచ్చి ప్రశ్నిస్తాయి భాయ్ సాబ్.
This post was last modified on March 29, 2025 8:06 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…