Movie News

రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది

బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే డైరెక్టర్ గా సక్సెస్ లేక నటుడిగా మారిపోయారు కానీ సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ సత్తా చూపించే టాలెంట్ ఉన్నోడే. కొన్ని నెలల క్రితం సౌత్ సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని, తమ హిందీ రైటర్స్ మాత్రం బాంద్రాలో చక్కర్లు కొడుతూ మాస్ ని మర్చిపోయారని కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిలిం అండ్ మీడియాలో నిర్వహించిన మాస్టర్ క్లాస్ కు అధ్యాపకుడిగా వచ్చిన అనురాగ్ కశ్యప్ చెప్పిన కొన్ని కీలక అంశాలు ప్రతి ఫిలిం మేకర్ ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. ప్రతి ఒక్కరు తమకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు విస్తృతంగా సినిమాలు చూడాలి. రాజమౌళిని అనుకరించబోయి ఇప్పుడు పది మంది డూప్లికేట్ రాజమౌళిలు తయారయ్యారు. కానీ అందరూ సక్సెస్ కావడం లేదు. ఆయన ఐడియాలను కాపీ కొడితే లాభం లేదు. ఒరిజినల్ గా ఉండాలి. కెజిఎఫ్ ని స్ఫూర్తిగా తీసుకుని అవే తీసిన దర్శకులు చాలానే ఉన్నారు. కానీ ఏమవుతోంది. ప్యాన్ ఇండియా కొత్త కాదు. చిరంజీవి ప్రతిబంద్, నాగార్జున శివ ఎప్పుడో తొంభై దశకంలో వచ్చిన ప్యాన్ ఇండియాలు. కాకపోతే ఇప్పుడీ ట్రెండ్ బంగారు బాతులా మారిపోయింది.

అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగానే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను ఇమిటేట్ చేయబోయి దెబ్బ తింటున్న డైరెక్టర్లు చాలానే ఉన్నారు. ఆ మధ్య కన్నడలో వందల కోట్లు ఖర్చు పెట్టి కబ్జా తీస్తే అచ్చం కెజిఎఫ్ కు నకలుగా ఉందని ప్రేక్షకులు, విమర్శకులు విరుచుకు పడ్డారు. బాహుబలి చూసి విజయ్ చేసిన పులి కూడా ఇదే కోవలోకి వస్తుంది. మణిరత్నం అంతటి దిగ్గజమే జక్కన్నను చూసే పొన్నియిన్ సెల్వన్ కి ధైర్యం తెచ్చుకున్నానని చెప్పారు. రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది. అందుకే ఎస్ఎస్ఎంబి 29 మీద వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నా చాలా చిన్నదే అనిపిస్తుంది.

This post was last modified on March 28, 2025 10:16 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago