మే 30 కింగ్ డమ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత మరో రెండు ప్యాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణీవారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందేది. దీనికి రౌడీ జనార్దన్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇటీవలే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ లో చెప్పేసిన దిల్ రాజు త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీమ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాని దర్శకుడు రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఊహించని మాస్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని సమాచారం.
ఇదిలా ఉండగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఓకే చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారయ్యిందని అంటున్నారు. బేబీ జాన్ డిజాస్టర్ తర్వాత మహానటి నటించిన రివాల్వర్ రీటా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. టీజర్ వచ్చి నెలలు దాటింది. నితిన్ ఎల్లమ్మకు కూడా తననే అడుగుతున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణగా తెలియలేదు. దీనికీ నిర్మాత దిల్ రాజే కాబట్టి డబుల్ ప్యాకేజ్ కింద మాట్లాడుకున్నారేమో చూడాలి. ఇప్పటి దాకా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జోడి కట్టలేదు. సర్కారు వారి పాటలో మహేష్ బాబుతో నటించాక కీర్తి సురేష్ కు మళ్ళీ స్టార్ ఛాన్స్ రాలేదు.
మే నుంచి షూటింగ్ కు వెళ్ళబోతున్న రౌడీ జనార్దన్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ప్రథమార్ధంలో రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ఆలోచన. ఒకవేళ అన్నీ కుదిరితే సంక్రాంతి రేసులో కూడా దింపొచ్చు. ప్రస్తుతానికి అయన ప్రొడక్షన్ నుంచి ఏ సినిమా పండగ బరిలో లేదు. పెద్ద బడ్జెట్ తో ఎక్కువ శాతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే రౌడీ జనార్దన్ లో ఫారిన్ లొకేషన్స్ ఉండవని తెలిసింది. నిజానికి రుక్మిణి వసంత్ ను కూడా అనుకున్నారట కానీ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోకి ఏడాది సైన్ చేయడంతో వేరే వాటికి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు వల్ల తనకు చాలా ఆఫర్సే మిస్సవుతున్నాయట.
This post was last modified on March 27, 2025 8:00 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…