బాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉంటూ అందరి వాడిగా గుర్తింపు తెచ్చుకుని, సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే అక్షయ్ కుమార్.. తన కొత్త సినిమా విషయంలో అనుకోని వివాదాన్ని ఎదుర్కొన్నాడు. అతను ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ రూపొందించిన కాంఛన రీమేక్‌కు లక్ష్మీబాంబ్ అని టైటిల్ పెట్టడంపై ఇటీవలే ఓ వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ సినిమాలో హీరో ముస్లిం, హీరోయిన్ హిందువు కాగా.. లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేందుకే ఇలా పెట్టారని ఆ వర్గం ఆరోపించింది. అలాగే లక్ష్మీబాంబ్ అని పేరు పెట్టడం ద్వారా హిందూ దేవత లక్ష్మిని అవమానించారని, దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తూ ఇదేం తీరని వాళ్లు గొడవ చేశారు.
లక్ష్మీబాంబ్ సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా పిలుపు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భయపడ్డ చిత్ర బృందం.. టైటిల్ మార్చేయాలని నిర్ణయించింది. బాంబ్ తీసేసి కేవలం లక్ష్మి అనే పేరును సినిమాకు ఖరారు చేసింది. ఇంతకుముందు పద్మావతి సినిమా విషయంలో గొడవలు జరిగితే రిలీజ్ ముంగిట ఆ టైటిల్‌ను పద్మావత్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
తెలుగులో సైతం వాల్మీకి టైటిల్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాగా.. విడుదలకు ముందు రోజు దాన్ని గద్దలకొండ గణేష్‌గా మార్చారు. దీపావళి కానుకగా నవంబరు 9న హాట్ స్టార్‌లో లక్ష్మి విడుదల కాబోతోంది. ఇందులో అక్షయ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించింది.
This post was last modified on October 29, 2020 9:44 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…