సీనియర్ నటుడు జగపతిబాబు హీరో వేషాలు మానేసి.. విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేశాక ఆయన కెరీర్ ఎలా మలుపు తిరిగిందో తెలిసిందే. కొన్నేళ్లుగా తెలుగులోనే కాదు.. దక్షిణాదిన వివిధ భాషల్లో భారీ సినిమాలు చేస్తూ అత్యంత డిమాండ్ ఉన్న విలన్/క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారాయన. పెద్ద హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలకు ముందు కన్సిడర్ చేస్తున్నది ఆయన్నే. అందుకు తగ్గట్లే జగపతి కూడా భారీ పారితోషకం అందుకుంటున్నారు. మంచి ఊపు మీద కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
ఐతే తాను మరీ కాస్ట్లీ అనుకుని చిన్న సినిమాల్లో మంచి పాత్రలకు తనను కన్సిడర్ చేయకపోవడం పట్ల జగపతి బాబు తాజాగా ట్విట్టర్లో కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ‘ఆహా’లో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటున్న ‘కలర్ ఫోటో’ సినిమా చూసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా మీద జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా తననెంతగానో ఆకట్టుకుందని, టీం అంతా చాలా బాగా పని చేసిందని ప్రశంసించిన జగ్గూభాయ్.. ఒక సినిమా విజయవంతం కావడానికి భారీ బడ్జెట్, స్టార్ కాస్టే అవసరం లేదని ‘కలర్ ఫోటో’ రుజువు చేసిందని అన్నాడు. ఇలాంటి యంగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి సృజనాత్మకతతో సినిమాలు చేస్తూ వేగంగా దూసుకెళ్తుంటే.. తన లాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని జగ్గూ భాయ్ కామెంట్ చేశాడు.
అంతే కాక ఇలాంటి సినిమాల్లో తాను కూడా భాగం అయితే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాల్లో తాను నటించను అనో, లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను అడుగుతుండకపోవచ్చని.. కానీ ఆ రెండూ అబద్ధమే అని చెప్పడం ద్వారా చిన్న సినిమాల్లో మంచి పాత్రలుంటే పారితోషకం తగ్గించుకుని చేయడానికి కూడా తాను రెడీ అని చెప్పకనే చెప్పాడు జగపతి. ఇది యువ ఫిలిం మేకర్లకు సంతోషాన్నిచ్చే విషయమే.
This post was last modified on %s = human-readable time difference 6:24 pm
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…