రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి లాంటి చిత్రాలతో ఒకప్పుడు తిరుగులేని బ్లాక్ బస్టర్లు అందించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ‘కత్తి’ టైంలో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు మురుగ. అప్పటికే అతను బాలీవుడ్లో ‘గజిని’ చిత్రాన్ని రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘కత్తి’ బ్లాక్ బస్టర్ అయ్యాక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ బాబు.. మురుగదాస్‌తో సినిమా చేశాడు. అది ఇంకో లెవెల్ సినిమా అవుతుందని అనుకుంటే డిజాస్టర్ అయింది. అక్కడ్నుంచి మురుగదాస్ కెరీర్ తిరగబడింది. సర్కార్, దర్బార్ సైతం నిరాశపరచడంతో మురుగదాస్‌కు డిమాండ్ పడిపోయింది.
దీంతో కొన్నేళ్ల గ్యాప్ కూడా వచ్చింది కెరీర్లో. మళ్లీ కుదురుకుని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’ తీశాడు. తమిళంలో శివకార్తికేయన్‌తోనూ ఓ మూవీ తీస్తున్నాడు. ఐతే ప్రస్తుతం మురుగదాస్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా సల్మాన్‌తో పాటు మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. ఈ దర్శకుడిని గౌరవించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు మురుగదాస్‌ను తమ చేతుల్లో ఎత్తుకుని ఫొటోలకు పోజులివ్వడం విశేషం. బాలీవుడ్‌లో లెజెండరీ డైరెక్టర్లను సైతం ఆమిర్, సల్మాన్ ఇలా గౌరవించి ఉండరు. తనకు ‘గజిని’ లాంటి మరపురాని విజయాన్ని అందించిన కృతజ్ఞత ఆమిర్‌కు మురుగదాస్ మీద ఉంది.
ఇక సల్మాన్ చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘సికందర్’తో మురుగ తనకూ సక్సెస్ ఇస్తాడని అతను నమ్ముతుండొచ్చు. ఏదేమైనప్పటికీ ఒక సౌత్ డైరెక్టర్‌ను ఇద్దరు లెజెండరీ బాలీవుడ్ హీరోలు ఇలా గౌరవించడం మాత్రం దక్షిణాది ఇండస్ట్రీకే గర్వకారణం. సౌత్ ఇండస్ట్రీని.. ఇక్కడి సినిమాలను.. సెలబ్రెటీలను… ఒకప్పుడు ఎంతో తక్కువగా చూసేవాళ్లు బాలీవుడ్ వాళ్లు. అలాంటిది ఇప్పుడు సౌత్ సినిమాల మీద వారి దృక్కోణం పూర్తిగా మారిపోయిందనడానికి ఈ ఫొటో ఒక సూచిక.
This post was last modified on March 26, 2025 8:13 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…