కేవలం 12 రోజుల గ్యాప్ తో ఇద్దరు సౌత్ దర్శకుల బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మొదటిది సికందర్. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈద్ సెంటిమెంట్ కోసం టీమ్ ని పరుగులు పెట్టించిన కండల వీరుడు హైప్ విషయంలో మాత్రం వెనుకబడ్డాడు. బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ జవాన్, పఠాన్ తరహాలో మాస్ హిస్టీరియా కనిపించడం లేదని బయ్యర్లు ఆందోళన చెబుతున్నారు. అందులోనూ ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ఆశించిన స్థాయిలో అంచనాలు పెంచలేకపోయాయి.
సో మార్చి 30న థియేటర్లలో భాయ్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తేనే గట్టెక్కుతాడు. ఎంత మాస్ అయినా ఏమైనా తేడా కొడితే సల్మాన్ అని చూడకుండా ఆడియన్స్ తిరస్కరిస్తారు. గతంలో రాధే, రేస్ 3, ట్యూబ్ లైట్ లాంటి వాటితో అది ఋజువయ్యింది. మురుగదాస్ డైరెక్షన్ ఓల్డ్ స్కూల్ లో ఉందనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వినిపించింది. ఇక రెండోది ఏప్రిల్ 10 రిలీజ్ కాబోతున్న జాట్. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. టీజర్ చిన్నదే అయినా ట్రేడ్, మాస్ ని ఆకట్టుకుంది. బిజినెస్ ఎంక్వయిరీలు పెరిగాయని నార్త్ వర్గాల కథనం.
అసలైన జాట్ ట్రైలర్ ఇంకా రాలేదు. టీజర్ కొచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి మరింత శ్రద్ధ వహించబోతున్నారు. కథ పరంగా కొంచెం రొటీన్ గానే అనిపిస్తున్నా యాక్షన్ విజువల్స్, సన్నీని ప్రెజెంట్ చేసిన తీరు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంచనాలు పెంచుతున్నాయి. రమ్యకృష్ణ, జగపతి బాబు, రెజీనా లాంటి తెలుగు క్యాస్టింగ్ తీసుకోవడం ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. గదర్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత సన్నీ డియోల్ సినిమా కావడం హైప్ పరంగా అది కూడా ప్లస్ అవుతోంది. ఏ కోణంలో చూసుకున్నా మురుగదాస్ మీద మలిలేని పై చేయి సాధించాడు. మొదటి తీర్పు ఇంకో నాలుగు రోజుల్లో వస్తుందిగా. చూద్దాం సల్లు భాయ్ ఏం చేస్తాడో.
This post was last modified on March 26, 2025 2:50 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…