బాలకృష్ణ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఆదిత్య 369 వచ్చే నెల ఏప్రిల్ నాలుగు రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పదకొండు అనుకున్నారు కానీ దానికి ముందు రోజే పెద్ద సినిమాలు ఉండటంతో ప్రీ పోన్ చేశారు. 1991లో రిలీజైన ఈ క్లాసిక్ ని టీవీ, యూట్యూబ్ లో బోలెడుసార్లు ప్రేక్షకులు చూసినప్పటికీ కొత్త జనరేషన్ పెద్ద తెరపై అనుభూతి చెందాల్సిన కంటెంట్ ఇందులో బోలెడుంది. అయితే ఒక పాత సినిమాను 4కెలో కన్వర్ట్ చేసి సిద్ధం చేసి అంత తేలికైన విషయం కాదు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు చెప్పింది వింటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆదిత్య 369 ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు అభిమానుల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని శివలెంక కృష్ణప్రసాద్ ఆరేడు సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నెగటివ్ అందుబాటులో లేదు. దీంతో పాజిటివ్ రీల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ చాలా చోట్ల అవి డ్యామేజయ్యాయనే వార్తలొచ్చాయి. ఇలా వెతుకులాట కొనసాగుతుండగా విజయవాడ శాంతి పిక్చర్స్ అధినేత వెంకటేశ్వరరావు నుంచి తన దగ్గర మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేశారు. దాన్ని తీసుకుని నేరుగా చెన్నైలో ఉన్న ప్రసాద్ కార్పొరేషన్ కి ఇచ్చి పనులు మొదలుపెట్టారు. 4K కన్వర్షన్ అయిదారు నెలలు పట్టింది.
ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కృష్ణప్రసాద్ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయడం, ఇద్దరు కలిసి చూసుకుని సంతృప్తి చెందాక రీ రిలీజ్ ప్రకటన ఇవ్వడం జరిగిపోయింది. అనుకుంటాం కానీ పాత సినిమా నెగటివ్ లు సకాలంలో భద్రపర్చుకోకపోతే ఏమవుతుందో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. శివ విషయంలో ఈ ఇబ్బంది ఎదురైందని నాగార్జున ఆ మధ్య ఓ ఈవెంట్ లో చెప్పారు. గీతాంజలికి ఇంకా సమస్య తీరలేదని అన్నారు. ఏదైతేనేం ఆదిత్య 369 ఇవన్నీ దాటుకుని 5.1 సౌండ్ మిక్స్ తో ఏప్రిల్ 4 మళ్ళీ థియేటర్లలో సందడి చేయబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ ఆలోచన జరుగుతోంది.
This post was last modified on March 26, 2025 11:18 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…