తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఈ రోజు ఓ విషాదం విషాదం చోటు చేసుకుంది. పలు చిత్రాల్లో నటించిన షిహాన్ హుస్సేని మరణించారు. ఈ పేరు మనవాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. ఆ వ్యక్తితో టాలీవుడ్‌కు కూడా ఓ బలమైన కనెక్షన్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలోకి రావడానికి ముందే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చిన వ్యక్తి షిహానే. అంతే కాదు.. కళ్యాణ్ గా ఉన్న పవన్ పేరును ‘పవన్ కళ్యాణ్’గా మార్చింది కూడా ఆయనే కావడం విశేషం. 60 ఏళ్ల షిహాన్ హుస్సేన్ సోమవారం గుండెపోటుతో మరణించారు.
ఆయన కొన్నేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం చికిత్స కోసం షిహాన్‌కు రూ.5 లక్షల సాయం కూడా చేసింది. క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న దశలో ఆయనకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు.కరాటెలోనే కాక ఆర్చరీలోనూ నిపుణుడైన షిహాన్.. 80వ దశకంలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టారు. రజినీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. ఎక్కువగా ఫైటర్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడి పాత్రల్లోనే కనిపించారు. చివరగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటించిన ‘కేఆర్‌కే’ సినిమాలో ఆయన కనిపించారు.
‘తమ్ముడు’ సినిమాలో పవన్ తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పాలని గురువు దగ్గర పంతం పట్టి నేర్చుకుంటాడన్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో షిహాన్ దగ్గర కూడా ఇలాగే పట్టుబట్టి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. కళ్యాణ్ అన్న పేరు ముందు ‘పవన్’ చేర్చింది తానే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో షిహాన్ తెలిపాడు. ఇదిలా ఉండగా తన మరణానంతరం అవయవాలను దానం చేయాలని షిహాన్ ముందే తీర్మానం చేయడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
షిహాన్ మరణంపై పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. షిహాన్ అనారోగ్యం గురించి తనకు నాలుగు రోజుల కిందటే తెలిసిందని.. చెన్నైలోని తన మిత్రుల ద్వారా వాకబు చేసి ఆయన్ని విదేశాలకు పంపడానికి ఏర్పాట్లు కూడా చేస్తానని హామీ ఇచ్చానని పవన్ తెలిపారు. ఈ నెల 29న షిహాన్‌ను కలవాలనుకున్నానని.. ఈలోపే దుర్వార్త వినాల్సి వచ్చిందని పవన్ చెప్పారు. ‘తమ్ముడు’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ సంబంధిత సన్నివేశాలను అంత బాగా చేయడానికి షిహాన్ ఇచ్చిన శిక్షణే దోహదం చేసిందని పవన్ తెలిపారు. తనకు శిక్షణ ఇవ్వడానికి ముందు ఆయన ఒప్పుకోలేదని.. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారని పవన్ గుర్తు చేసుకున్నారు.
This post was last modified on March 25, 2025 1:49 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…