కరోనా టైంలో మిగతా సినీ ప్రముఖులంతా షూటింగ్‌ల కోసం హడావుడి పడుతుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని కలిసి షూటింగ్‌లకు అనుమతులు కోరుతుంటే.. అదంతా వృథా ప్రయాస అని తేల్చేసి, ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు మొదలు కాబోవని తేల్చేశాడు నందమూరి బాలకృష్ణ. ముందు ఆయన మాటల్ని అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి.
కరోనా తీవ్రత దృష్ట్యా అనుకున్న ప్రకారం షూటింగ్‌లు మొదలుపెట్లేకపోయారు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. కొందరు పని మొదలుపెట్టినా కరోనా ధాటికి మధ్యలో ఆపేశారు. ఎట్టకేలకు గత నెల రోజుల నుంచే షూటింగ్‌లు పున:ప్రారంభించి చకచకా పని చేసుకుపోతున్నారు. ఈ టైంలో కూడా బాలయ్య కొంచెం వెయిట్ చేశారు. చివరికి ఆయన కూడా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారమే పున:ప్రారంభం అయింది. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ‘బీబీ3’గా పిలుచుకుంటున్న తమ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయినట్లుగా పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా కోసం బాలయ్య నిర్విరామంగా పని చేయబోతున్నాడట. ప్రస్తుత షెడ్యూల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.
టాలీవుడ్ విషయానికి వస్తే ఇక రంగంలోకి దిగాల్సిన పెద్ద హీరోల్లో చిరంజీవి ఒకరు. కరోనా విజృంభిస్తున్న టైంలోనే షూటింగ్ కోసం చాలా ఆతృతగా కనిపించిన చిరు.. ఇప్పటికీ రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఒకట్రెండు రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కూడా పున:ప్రారంభం అవుతుందని.. ముందు చిరు లేని సన్నివేశాలు తీస్తారని, నవంబరు 3న ఆయన సెట్స్ పైకి వస్తారని అంటున్నారు.
This post was last modified on October 29, 2020 3:13 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…