స్టార్ క్యాస్టింగ్ లేకుండా కంటెంట్ ని నమ్ముకుని కొత్త దర్శకుడికి అవకాశమిచ్చిన నిర్మాత నాని దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. నిన్నటితో కోర్ట్ 50 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టేసింది. మొదటి వారమే 39 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ ఎమోషనల్ డ్రామా రెండో వీకెండ్ కే మరో పదకొండు కోట్లు జోడించి హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. నిన్న మంచి ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. కీలకమైన హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచులు లేకపోయి ఉంటే ఇంకా పెద్ద నెంబర్లు వచ్చేవని ట్రేడ్ టాక్. మధ్యాన్నం, సాయంత్రం షోలకు ఈ కారణంగా రద్దీ తగ్గిపోయిందని అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు.
పది రోజులు పూర్తి చేసుకున్న కోర్ట్ కు ఈ వారం కీలకం. ఎందుకంటే మార్చి 27, 28, 30 తేదీల్లో కొత్త రిలీజులు సందడి చేయబోతున్నాయి. మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, సికందర్ వరసగా నువ్వా నేనాని తలపడతున్నాయి. వీటికి థియేటర్ల సర్దుబాటు వల్ల కోర్ట్ స్క్రీన్లు గణనీయంగా తగ్గుతాయి. అందులోనూ వీక్ డేస్ లో బాగా నెమ్మదించిన కారణంగా కోర్ట్ ఇకపై ఎక్కువ నెంబర్లు నమోదు చేయకపోవచ్చు. ఎలా చూసుకున్నా ఊహించిన దానికన్నా చాలా పెద్ద విజయమిది. ఇది నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దని నాని విసిరిన ఛాలెంజ్ ని నిలబెట్టిన సక్సెస్ గా చాలా స్పెషల్ గా ఉండిపోతుంది.
దీని బాధ్యత తీరిపోయింది కాబట్టి నాని ఇకపై హిట్ 3 ది థర్డ్ కేసు పబ్లిసిటీకి వేగం పెంచబోతున్నారు. మే 1 విడుదల ఎంతో దూరంలో లేదు. మార్చి మినహాయిస్తే చేతిలో ఉన్నది ఒక్క నెలే. సో ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తీసుకెళ్లాలంటే చాలా బలంగా ప్లాన్ చేసుకోవాలి. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంలు ఆశించిన స్థాయిలో హిందీ వెర్షన్లు అద్భుతాలు చేయలేకపోయాయి. ఆ లోటుని హిట్ 3 తీరుస్తుందనే కాన్ఫిడెన్స్ నానిలో ఉంది. ఇక కోర్ట్ ఓటిటి స్ట్రీమింగ్ ఏప్రిల్ రెండో వారంలో ఉండొచ్చని టాక్. నాలుగు వారాల నిడివి అగ్రిమెంట్ కాబట్టి పన్నెండు లేదా పదమూడో తేదీ స్ట్రీమింగ్ జరగొచ్చు.
This post was last modified on March 24, 2025 10:56 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…