పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన మిత్రుడైన రామ్ తాళ్ళూరి గతంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. దీనికో ప్రి లుక్ పోస్టర్ కూడా డిజైన్ చేసింది చిత్ర బృందం. కానీ ఈ సినిమాను ప్రకటించి ఏళ్లు గడిచినా ఏ అప్‌డేట్ లేదు. పవన్ చేతిలో ఆల్రెడీ మూడు చిత్రాలున్నాయి. అవే పూర్తి కాలేదు. ఈ మూడూ ఫినిష్ అయ్యి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియట్లేదు. పవన్ చూస్తే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ నిర్మాణంలో సురేందర్ తీయాల్సిన ఈ చిత్రాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు.
ఈ మేరకు మీడియాకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చింది. ఐతే పవన్ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇదేదో కొత్త విషయంలా మాట్లాడుతున్నారు. కానీ ఈ చిత్రంపై నిర్మాత రామ్ తాళ్ళూరి ఎప్పుడో ఆశలు కోల్పోయారు. తన ప్రొడక్షన్లో వచ్చిన చివరి చిత్రం ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ టైంలోనే ఆయనీ విషయమై క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమా మీద తాము ఆశలు కోల్పోయామన్నారు.
పవన్ ప్రస్తుతం ఉన్న బిజీలో ఈ సినిమా చేస్తామనే వాస్తవిక అంచనా లేదని చెప్పేశారు. మరోవైపు సురేందర్ రెడ్డి చూస్తే ఈ సినిమా ఊసే ఎత్తకుండా వేరే ప్రయత్నాలేవో చేసుకుంటున్నాడు. అధికారికంగా ప్రకటించలేదన్న మాటే కానీ.. ఈ మూవీ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయినట్లే. ఇప్పుడు లాంఛనం ముగిసింది అన్నమాట. అసలు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఆల్రెడీ కొంత చిత్రీకరణ జరుపుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు కదులుతుందో లేదో అన్న సందేహాలు కలుగుతుండడం గమనార్హం.
This post was last modified on March 23, 2025 2:39 pm
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…