హీరోలన్నాక ఫ్లాపులు సహజం. కాకపోతే వరసగా వస్తేనే ఇబ్బంది. నితిన్ కు ఈ సమస్య ఎదురయ్యింది. ప్రతిసారి ఒక హిట్టు రావడం ఆలస్యం వెనుక క్యూలో రెండు మూడు డిజాస్టర్లు పలకరిస్తాయి. అందుకే రాబిన్ హుడ్ మీద ఓ రేంజ్ లో నమ్మకం పెట్టేసుకున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి భారీ అంచనాల మధ్య తలకిందుల ఫలితాలు అందుకున్నాయి. వీటి కన్నా ముందు రంగ్ దే, చెక్ కూడా పరాజయం మూటగట్టుకున్నాయి. అందుకే చివరి హిట్ భీష్మ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతోనే మరోసారి చేతులు కలిపాడు. మార్చి 28 రాబిన్ హుడ్ తో గురి తప్పదనే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు.
ఈ సందర్భంగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లాపుల గురించి నితిన్ నిజాయితీగా ఓపెనయ్యాడు. నా స్క్రిప్ట్ ఎంపికలో జరిగిన పొరపాట్ల వల్లనో లేదా పక్కనున్న వాళ్ళు ప్రభావితం చేయడం వల్లనో కారణం ఏదైతేనేం ఒక హిట్టు మూడు ఫ్లాపులుగా కెరీర్ హెచ్చుతగ్గులకు గురైందని ఒప్పుకున్నాడు. రాబోయే సంవత్సరాల్లో పాత్ బ్రేకింగ్ మూవీస్ తో మళ్ళీ ఋజువు చేసుకుంటాననే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో రాబోయే తమ్ముడు ట్రైలర్ మీద ఇండస్ట్రీలో ప్రీ పాజిటివ్ బజ్ ఉంది. ఎల్లమ్మ తనకు నటుడిగానూ ఒక ఛాలెంజ్ గా నిలుస్తుందని జయంని మించిన రూటెడ్ కంటెంట్ ఉంటుందని నితిన్ చెబుతున్నాడు.
ఇక యువి క్రియేషన్స్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తీయబోయే భారీ చిత్రం తనకు చెప్పిన ప్రకారమే తీస్తే టాలీవుడ్ ఎప్పటికీ చెప్పుకునే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందని నితిన్ నమ్మకం. మొత్తానికి తన లైనప్ రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా నిజంగానే వైవిధ్యంగా కనిపిస్తోంది. రాబిన్ హుడ్ తో కనక సక్సెస్ ట్రాక్ ఎక్కితే మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. హీరోయిన్ శ్రీలీల, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల మార్క్ ఎంటర్ టైన్మెంట్, మైత్రి నిర్మాణ విలువలు వెరసి ఎంత పోటీ ఉన్నా రాబిన్ హుడ్ హిట్టవుతుందనే ధీమా నితిన్ లో కనిపిస్తోంది. వచ్చే వారం తీర్పు వచ్చేస్తుంది.
This post was last modified on March 21, 2025 7:55 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…